- కల్యాణ్ రామ్ డబ్బింగ్ పనులు ప్రారంభం
- సగం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పూర్తి చేసిన జీవీ ప్రకాశ్
- కజకిస్థాన్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ
- లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేశ్ లుక్
- 2027 సంక్రాంతి కానుకగా 'జనవరి 12న విడుదల'
విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'జనవరి 12 విడుదల' పనులు శరవేగంగా సాగుతున్నాయి. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి నటుడు కల్యాణ్ రామ్ తాజాగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా, పూర్తి సరికొత్త స్టైలిష్ అవతారంలో అనిల్ రావిపూడి ఆయనను ప్రెజెంట్ చేస్తున్నట్లు చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు, ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న జీవీ ప్రకాశ్ కుమార్ సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అప్డేట్ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సినిమాకు సంబంధించి ఇప్పటికే సగం బీజీఎం పనులు పూర్తయ్యాయని, సినిమా అవుట్‌పుట్ చూస్తుంటే బ్లాక్‌బస్టర్ కళ స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘ఆకాశంలో ఒక తార’, ‘ఇరుముడి’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తర్వాత తెలుగులో ఆయనకు ఇది నాల్గో చిత్రంగా నిలవనుంది.
ఇటీవలే చిత్ర బృందం కజకిస్థాన్‌లో ఒక కీలకమైన భారీ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అక్కడ వెంకటేశ్, కల్యాణ్ రామ్‌లపై ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ రియల్ సతీష్ నేతృత్వంలో హై-వోల్టేజ్ యాక్షన్ ఘట్టాలను తెరకెక్కించారు. అక్కడి అద్భుతమైన లొకేషన్లలో రూపొందించిన ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని యూనిట్ వర్గాలు తెలిపాయి. అలాగే, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఇద్దరు హీరోలపై ఒక ప్రత్యేకమైన పాటను కూడా కజకిస్థాన్లోనే చిత్రీకరించారు.
ఈ విదేశీ షెడ్యూల్‌కు ముందు మైసూర్, తమిళనాడులోని ఊటీలలో కూడా షూటింగ్ నిర్వహించారు. మైసూర్ షెడ్యూల్లో వెంకటేశ్, కల్యాణ్ రామ్, కీర్తి సురేశ్, కృతి శెట్టి నలుగురు ప్రధాన నటులు పాల్గొన్నారు. అక్కడ ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా మాస్టర్ సారథ్యంలో ఒక పాటను తెరకెక్కించారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె కొరియోగ్రఫీలో నటించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని నటుడు శ్రీమాన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
సినీ పరిశ్రమలో 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా వెంకటేశ్ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో వెంకటేశ్ ఇండియన్ ఆర్మీకి చెందిన ‘లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి’ పాత్రలో కనిపించనున్నారు. కౌంటర్ టెర్రరిజం, బందీల విముక్తి ఆపరేషన్లలో నిపుణుడైన ఆర్మీ ఆఫీసర్‌గా వెంకటేశ్ లుక్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.
షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ అర్చన, జీ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. వెంకటేష్ సరసన కీర్తి సురేష్, కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తున్న ఈ పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రాన్ని 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.