- కడప జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టివేత
- 114 దుంగలు, ఏడు వాహనాలు స్వాధీనం చేసుకున్న అధికారులు
- అటవీశాఖ సిబ్బందిని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- స్మగ్లింగ్ మార్గాలన్నీ మూసివేయాలని కఠిన ఆదేశాలు జారీ
ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కీలక విజయం సాధించిన వైఎస్ఆర్ కడప జిల్లా అటవీశాఖ అధికారులను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు. భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న ఆపరేషన్‌పై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
నిర్దిష్ట నిఘా సమాచారంతో అప్రమత్తమైన యాంటీ-రెడ్ శాండర్స్ టాస్క్‌ఫోర్స్, అటవీశాఖ ప్రత్యేక బృందాలు వైఎస్ఆర్ కడప ఫారెస్ట్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో సుమారు 114 ఎర్రచందనం దుంగలతో పాటు, రవాణాకు ఉపయోగిస్తున్న ఏడు వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంబులెన్సులు, కార్లలో దుంగలను తరలిస్తుండగా పట్టుకున్నట్లు అటవీశాఖ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా కడప జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో), ఆయన బృందాన్ని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. స్మగ్లర్లు అడవిలోకి ప్రవేశించడానికి కూడా భయపడేలా అక్రమ రవాణా మార్గాలన్నింటినీ మూసివేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పరారీలో ఉన్న మిగతా నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయాలని, ఈ స్మగ్లింగ్ నెట్వర్క్ వెనుక ఉన్న సూత్రధారులను పట్టుకునేందుకు సమగ్ర దర్యాప్తు జరపాలని సూచించారు. అటవీ సంపదను దోచుకునే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాలపై నిఘా పెంచి, దాడులను మరింత తీవ్రతరం చేయాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.