- 'ఆకాశంలో ఒక తార' సినిమా అద్భుతంగా ఉందన్న కేటీఆర్
- దుల్కర్ సల్మాన్, శ్రుతిహాసన్ నటన చిత్రానికి మరింత బలం చేకూర్చిందని ప్రశంస
- తొలి చిత్రంతోనే అద్భుత ప్రతిభ చాటిన సాత్విక వీరవల్లికి ప్రత్యేక అభినందనలు తెలిపిన కేటీఆర్
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. సినిమా ఎంతో బాగుందని, చాలా కాలం తర్వాత ఇంతటి అందమైన చిత్రాన్ని చూశానని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ మేరకు చిత్ర బృందాన్ని అభినందిస్తూ ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టారు.
ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ.. "అసాధ్యమైన కలలు కనడమే కాదు... వాటిని నిజం చేసుకోవడానికి చేసే స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ఈ చిత్రం ఎంతో అందంగా ఆవిష్కరించింది. 'ఆకాశంలో ఒక తార' చాలా సరళంగా, అద్భుతంగా ఉంది. చాలా కాలం తర్వాత ఇంతటి అందమైన సినిమాను చూశాను. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్, శ్రుతిహాసన్ తమ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాతో పరిచయమైన సాత్విక తొలి చిత్రంతోనే అద్భుతమైన ప్రతిభను చాటుకున్నారు. ఆమె నటనకు ప్రత్యేకంగా అభినందనలు. దర్శకుడు పవన్ సాధినేని కూడా అద్భుతమైన పనితీరును కనబరిచారు. అద్భుతమైన సినిమా అందించిన చిత్ర బృందానికి అభినందనలు" అని రాసుకొచ్చారు.
పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రలు పోషించగా, శ్రుతిహాసన్ కీలక పాత్రలో మెరిశారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సంయుక్తంగా సమర్పించిన ఈ చిత్రం మంచి టాక్ సాధించింది.