- శరీరాన్ని కదిలించే విధానంపైనే డిమెన్షియా ముప్పు ఆధారపడి ఉందన్న నిపుణులు
- వ్యాయామం చేసేవారిలో 24 శాతం తగ్గుతున్న మతిమరుపు ముప్పు
- భారీ శారీరక శ్రమ చేసే ఉద్యోగుల్లో డిమెన్షియా ముప్పు 20 శాతం పెరిగే చాన్స్!
- 42 లక్షల మందిపై 30 దేశాల్లో విస్తృతంగా సాగిన అధ్యయనం
- పని ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడమే ప్రధాన కారణాలు
శరీరాన్ని నిరంతరం కష్టపెట్టడం లేదా శారీరక శ్రమ చేయడం ఆరోగ్యానికి మంచిదని అందరూ భావిస్తుంటారు. అయితే, శారీరక శ్రమ అందరిలో ఒకే విధమైన ప్రయోజనాలను ఇవ్వదని, మనం చేసే శ్రమ స్వభావాన్ని బట్టి ఫలితాలు పూర్తిగా తారుమారవుతాయని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. విశ్రాంతి సమయంలో ఇష్టపూర్వకంగా చేసే వ్యాయామాలు డిమెన్షియా (తీవ్రమైన మతిమరుపు) ప్రమాదాన్ని తగ్గిస్తుండగా, ఉద్యోగాల్లో భాగంగా చేసే భారీ శారీరక శ్రమ మాత్రం ఈ ముప్పును ఏకంగా 20 శాతం పెంచుతున్నట్లు వెల్లడైంది.
యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా పరిశోధకులు నిర్వహించిన ఈ విస్తృత అధ్యయనం వివరాలు అంతర్జాతీయ వైద్య జర్నల్ ‘ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్’లో ప్రచురితమయ్యాయి. 30 దేశాలకు చెందిన 45 నుంచి 93 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 42 లక్షల మంది జీవనశైలిని దాదాపు పదేళ్ల పాటు పరిశీలించి ఈ నివేదికను రూపొందించారు.
ఈ అధ్యయనం ప్రకారం.. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఆటలు వంటి వినోదభరిత వ్యాయామాలు చేసేవారిలో డిమెన్షియా వచ్చే ముప్పు 24 శాతం వరకు తక్కువగా నమోదైంది. మరోవైపు, రోజువారీ ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా గంటల తరబడి నిలబడి పనిచేయడం, భారీ బరువులు మోయడం వంటి పనులు చేసేవారిలో మాత్రం డిమెన్షియా వచ్చే ముప్పు 20 శాతం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
ఈ తేడాకు కారణాలేమిటి?
ఈ రెండు రకాల శారీరక శ్రమల మధ్య ఫలితాలు భిన్నంగా ఉండటానికి ప్రధాన కారణం వాటి వెనుక ఉన్న వాతావరణమేనని పరిశోధకులు వివరించారు. సాధారణంగా మనం చేసే వ్యాయామాలు మన నియంత్రణలో ఉంటాయి, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. కానీ ఉద్యోగంలో చేసే శారీరక శ్రమలో పని తీవ్రత మన చేతుల్లో ఉండదు. నిరంతరాయంగా ఒకే పని చేయడం, అలసట, శరీరానికి తగినంత విశ్రాంతి దొరక్కపోవడం, పని ప్రదేశాల్లోని కాలుష్యం, మానసిక ఒత్తిడి వంటి అంశాలు మెదడు ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
అయితే, ఈ అధ్యయనం కేవలం పరిశీలనాత్మక డేటాపై ఆధారపడిందని, శారీరక శ్రమ వల్ల నేరుగా డిమెన్షియా వస్తుందని ఖచ్చితంగా నిర్ధారించలేమని నిపుణులు పేర్కొన్నారు. కేవలం "ఎక్కువగా కదలండి" అని చెప్పడం కంటే, పని చేసే వాతావరణాన్ని మెరుగుపరచడం, తగినంత రికవరీ సమయం కల్పించడం, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇవ్వడం మెదడు ఆరోగ్యానికి అత్యంత కీలకమని పరిశోధకులు సూచిస్తున్నారు.