- భారత్ ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన శ్రీధర్ బాబు
- డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026
- సమ్మిట్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం
హైదరాబాద్ శివారులోని భారత్ ఫ్యూచర్ సిటీలో త్వరలో జరగనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026' ఏర్పాట్లను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వేదిక నిర్మాణం, ఎక్స్పో జోన్, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ, అతిథుల వసతి తదితర అంశాలపై అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. సమ్మిట్ ఏర్పాట్లను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగేలా గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పారిశ్రామిక, ఆర్థిక సామర్థ్యాన్ని చాటిచెప్పేందుకు ఈ వేదిక అత్యంత కీలకమని పేర్కొన్నారు. పనులన్నీ సకాలంలో పూర్తయ్యేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.
భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఈ సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,500 మందికి పైగా సీఈవోలు, పెట్టుబడిదారులు, దౌత్యవేత్తలు హాజరుకానున్నారు. అలాగే డిఫెన్స్, ఫార్మా, గేమింగ్, ఏఐ వంటి కీలక రంగాల నుంచి 1,000 కంటే ఎక్కువ కంపెనీలు పాల్గొనేలా మల్టీ సెక్టార్ ఎక్స్పోను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
భద్రతా పరంగా ఫేషియల్ రికగ్నిషన్ వంటి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుంది.