- గూగుల్ ఇండియా బ్లాగ్ ద్వారా అధికారికంగా ధ్రువీకరించిన యూట్యూబ్
- నెలకు రూ.59 నుంచి రూ. 1,999 వరకు మూడు ప్లాన్లు
- 1.24 కోట్లకు పైగా సబ్స్క్రైబర్లతో దూసుకుపోతున్న కమెడియన్ సమయ్ రైనా
- 2025 వివాదం, ఎఫ్ఐఆర్లు, డిప్రెషన్ తర్వాత అదిరిపోయే కమ్‌బ్యాక్
- నెట్‌ఫ్లిక్స్ భాగస్వామ్యంతో ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ సీజన్ 2 పునఃప్రారంభం
భారతీయ స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా ప్రపంచ యూట్యూబ్ చరిత్రలోనే ఎవరూ సాధించని అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌లో ఏకంగా 10 లక్షల (1 మిలియన్) పెయిడ్ ఛానెల్ మెంబర్లను దక్కించుకున్న తొలి క్రియేటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మైలురాయిని గూగుల్ ఇండియా తన అధికారిక బ్లాగ్ ద్వారా ధ్రువీకరించింది. తీవ్ర వివాదాలు, ఎఫ్ఐఆర్లు, డిప్రెషన్ నుంచి కోలుకున్న తర్వాత రైనా సాధించిన ఈ విజయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
చెస్ గ్రాండ్‌మాస్టర్లతో చేసిన వినోదాత్మక చర్చలు, సంచలనం సృష్టించిన ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోతో సమయ్ తన ఛానెల్‌ను లక్షలాది మంది నెటిజన్లకు అభిమాన అడ్డాగా మార్చారని యూట్యూబ్ ప్రశంసించింది. ఆయన ఛానెల్‌లో నెలకు రూ. 59తో 'సమయ్ కే దోస్త్', రూ. 599తో 'సమయ్ కే ఖాస్', రూ. 1,999తో 'సైలెంట్ సపోర్టర్' పేర్లతో మూడు రకాల పెయిడ్ మెంబర్‌షిప్ ప్లాన్లు ఉన్నాయి. ఇప్పటికే 1.24 కోట్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్న సమయ్ రైనాకు, ఏకంగా 10 లక్షల మంది క్రమం తప్పకుండా డబ్బులు చెల్లించే సభ్యులుగా మారడం భారత క్రియేటర్ ఎకానమీ ఎదుగుదలకు నిదర్శనంగా నిలిచింది. 2026 జూన్ నెలలోనే భారత్‌లో 12 లక్షల మందికి పైగా అభిమానులు యూట్యూబ్ మెంబర్‌షిప్‌లు కొనుగోలు చేశారని, క్రియేటర్ల ఆదాయం వార్షికంగా 25 శాతం పెరిగిందని యూట్యూబ్ తెలిపింది.
2025 ఫిబ్రవరిలో 'ఇండియాస్ గాట్ లేటెంట్' షోలో రణ్‌వీర్ అలహాబాదియా చేసిన ఓ జోక్ తీవ్ర దుమారానికి దారితీసింది. ఆ వివాదం ముదిరి సమయ్ రైనా సహా పలువురిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు కావడంతో, ఆయన షో ఎపిసోడ్లన్నింటినీ ఛానెల్ నుంచి తొలగించాల్సి వచ్చింది. ఆ సమయంలో కెనడాలో ఉన్నప్పుడు తీవ్ర డిప్రెషన్‌కు లోనయ్యానని, ‘నా షో మళ్లీ ఎప్పుడైనా తిరిగి వస్తుందా?’ అని చాట్‌జీపీటీని అడిగేవాడినని స్వయంగా రైనా గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత ‘స్టిల్ అలైవ్’ స్టాండప్ స్పెషల్‌తో తిరిగి అడుగుపెట్టిన ఆయన, 2026లో నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ సీజన్ 2ను విజయవంతంగా తీసుకొచ్చారు. ఆ సంక్షోభం నుంచి పుంజుకొని ఇప్పుడు ప్రపంచ రికార్డు నెలకొల్పడం గమనార్హం.