- యూపీలో కాంగ్రెస్‌కు 26 సీట్లు ఆఫర్ చేసిన సమాజ్‌వాదీ పార్టీ
- విషయాన్ని స్వయంగా మీడియాకు వెల్లడించిన ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్
- మొదట 181 సీట్లు కోరి, ఆపై 100-120కి తగ్గిన కాంగ్రెస్
- సీట్ల సంఖ్య కంటే గెలుపు గుర్రాలే ముఖ్యమంటున్న అఖిలేష్
- అమేథీ, రాయ్‌బరేలీ, మైన్‌పురి స్థానాల రక్షణకు సమాలోచనలు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సీట్ల సర్దుబాటు వ్యవహారంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) కాంగ్రెస్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. ‘ఇండియా’ కూటమిలో భాగంగా కాంగ్రెస్‌కు కేవలం 26 స్థానాలు మాత్రమే ఇవ్వాలని అఖిలేష్ యాదవ్ పార్టీ ప్రతిపాదించింది. రెండో విడత సీట్ల చర్చలకు ముందు ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్ మంగళవారం ఈ సంచలన విషయాన్ని మీడియా ముందు వెల్లడించారు. తాము ప్రస్తుతానికి 26 సీట్లను ఆఫర్ చేశామని, తదుపరి సమావేశాల్లో మరింత లోతుగా చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు.
2027 యూపీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తొలుత ఏకంగా 181 స్థానాలు కావాలని డిమాండ్ చేసింది. అయితే ఎస్పీ నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో వెనక్కి తగ్గి, సోమవారం ఢిల్లీలో జరిగిన తొలి సమావేశంలో 100 నుంచి 120 స్థానాల జాబితాను సమర్పించింది. సుమారు 70 నుంచి 80 సీట్లను వదులుకుంటూ కాంగ్రెస్ పట్టు తగ్గించినప్పటికీ.. ఎస్పీ మాత్రం కేవలం 26 స్థానాలకే పరిమితం చేయడం కూటమిలో కాకరేపుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, రాహుల్ గాంధీ జాతీయ ఇమేజ్‌ను బట్టి తమకు ఎక్కువ స్థానాలు దక్కాలని హస్తం నేతలు వాదిస్తున్నారు.
సీట్ల సంఖ్య కంటే అభ్యర్థుల గెలుపు అవకాశాలే కూటమికి ముఖ్యమని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పష్టం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో పార్టీల బలాబలాలు, ఓటర్ల నాడి ఆధారంగానే సీట్లు కేటాయించాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోటలైన అమేథీ, రాయ్‌బరేలీతో పాటు ఎస్పీకి పట్టున్న మైన్‌పురి, ఇటావా వంటి స్థానాల్లో ఒకరికొకరు మద్దతుగా ఉండాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఢిల్లీలోని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ప్రమోద్ తివారీ నివాసంలో జరిగిన తొలి భేటీ కేవలం 20 నిమిషాల్లోనే ముగిసింది. ఇప్పుడు రెండో విడత చర్చల్లో స్థానాల సంఖ్యపై ఇరు పార్టీలు ఎలాంటి రాజీకి వస్తాయో అన్నది ఉత్కంఠగా మారింది.