- చైనా స్పేస్ స్టేషన్ తియాంగాంగ్‌లో కవి ఇక్బాల్ పంక్తులను ఆలపించిన పాక్ వ్యోమగామి
- ఉర్దూలో కవిత పాడి సహచరులకు మాండరిన్ భాషలో అర్థం చెప్పిన జీషాన్ అలీ
- 1984లో ఇందిరా గాంధీకి రాకేష్ శర్మ చెప్పిన 'సారే జహా సే అచ్ఛా' పంక్తుల జ్ఞాపకాలు
- 1997లో కల్పనా చావ్లాతో మాట్లాడుతూ ఇక్బాల్ కవితను గుర్తుచేసిన ప్రధాని ఐకే గుజ్రాల్
- సరిహద్దులు దాటి అంతరిక్షంలో భారత్, పాక్‌లను ఏకం చేసిన ఉర్దూ సాహిత్యం
అంతరిక్షంలోకి వెళ్లిన పాకిస్థాన్ తొలి వ్యోమగామి ముహమ్మద్ జీషాన్ అలీ చైనాకు చెందిన 'తియాంగాంగ్' స్పేస్ స్టేషన్లో తేలియాడుతూ చేసిన కవితా గానం భారత్, పాక్ దేశాల మధ్య సరిహద్దులు దాటిన సాహిత్య బంధాన్ని మరోసారి గుర్తుచేసింది. చైనా సహచరుల సమక్షంలో ఆయన పాకిస్థాన్ జాతీయ కవి అల్లామా ముహమ్మద్ ఇక్బాల్ రచించిన ప్రసిద్ధ ఉర్దూ కవితా పంక్తులను ఆలపించారు. "సితారోం సే ఆగే జహా ఔర్ భీ హై.. అభీ ఇష్క్ కే ఇమ్తిహాన్ ఔర్ భీ హై" (నక్షత్రాలకు ఆవల ఇంకా ఎన్నో లోకాలున్నాయి.. ప్రేమకు ఎదురయ్యే పరీక్షలు ఇంకా ఎన్నో మిగిలున్నాయి) అంటూ చదివి, అనంతరం ఆ పంక్తుల భావాన్ని మాండరిన్ భాషలోకి అనువదించి చైనీస్ వ్యోమగాములను ఆశ్చర్యపరిచారు.
ఇక్బాల్ కవిత్వం అంతరిక్షంలో ప్రతిధ్వనించడం ఇదే తొలిసారి కాదు. భారత్‌కు చెందిన ఇద్దరు వ్యోమగాముల అంతరిక్ష ప్రయాణాల్లోనూ ఇక్బాల్ రచనలు ప్రముఖంగా నిలిచాయి. 1984లో అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేష్ శర్మతో నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ మాట్లాడుతూ 'అంతరిక్షం నుంచి మన దేశం ఎలా కనిపిస్తోంది?' అని అడిగినప్పుడు.. ఆయన తడుముకోకుండా ఇక్బాల్ రాసిన ‘సారే జహా సే అచ్ఛా, హిందుస్తాన్ హమారా’ అంటూ బదులిచ్చారు.
ఆ తర్వాత 1997లో భారత సంతతికి చెందిన వ్యోమగామి కల్పనా చావ్లా అమెరికా కొలంబియా స్పేస్ షటిల్లో ఉన్నప్పుడు, అప్పటి భారత ప్రధాని ఐకే గుజ్రాల్ ఆమెతో మాట్లాడుతూ సరిగ్గా ఇదే పంక్తిని ("సితారోం సే ఆగే జహా ఔర్ భీ హై") ప్రస్తావించి మాట్లాడారు. ఉపఖండంలో విశేష ప్రాచుర్యం పొందిన ఇక్బాల్ కవితలు.. దేశాల విభజన, రాజకీయ శత్రుత్వాలను దాటి మూడు వేర్వేరు అంతరిక్ష యాత్రల్లో భారత్, పాకిస్థాన్‌లను ఒక్కటి చేయడం విశేషం.