- కూచ్ బెహార్ ట్రోఫీలో పంజాబ్‌పై 7 వికెట్లతో వేదాంత్ సెహ్వాగ్ రికార్డు
- అన్న ఆర్యవీర్ సారథ్యంలోనే అదరగొట్టిన తమ్ముడు వేదాంత్
- 22.3 ఓవర్లలో 88 పరుగులిచ్చి 7 కీలక వికెట్లు తీసిన ఆఫ్ స్పిన్నర్
- పంజాబ్‌ను 238 పరుగులకే కుప్పకూల్చిన 16 ఏళ్ల వేదాంత్
- ఓపెనర్‌గా క్రీజులో నిలిచి 31 పరుగులు చేసిన కెప్టెన్ ఆర్యవీర్
- ఆసియా కప్ సక్సెస్, ఐపీఎల్ వేలం బరిలో నిలిచిన అన్న ఆర్యవీర్
భారత దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, వేదాంత్ సెహ్వాగ్ దేశవాళీ క్రికెట్ టోర్నీలో సరికొత్త చరిత్ర లిఖించారు. కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ అండర్-19 జట్టుకు అన్న ఆర్యవీర్ (19) కెప్టెన్‌గా వ్యవహరించగా, తమ్ముడు వేదాంత్ (16) ప్రత్యర్థి పంజాబ్ జట్టుపై ఏకంగా ఏడు వికెట్లతో విరుచుకుపడి మ్యాచ్‌ను శాసించాడు.
రోపర్‌లోని గవర్నమెంట్ కాలేజ్ మైదానంలో పంజాబ్‌తో ప్రారంభమైన నాలుగు రోజుల మ్యాచ్‌లో రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ వేదాంత్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 22.3 ఓవర్లు బౌలింగ్ చేసి, 5 మెయిడెన్లు వేసి కేవలం 88 పరుగులిచ్చి 7 వికెట్లు నేలకూల్చాడు. దీంతో పంజాబ్ జట్టు మొదటి రోజే 65.3 ఓవర్లలో 238 పరుగులకే కుప్పకూలింది. భారత అండర్-19 ఆసియా కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన పంజాబ్ కెప్టెన్ అర్జున్ రాజ్‌పుత్ వికెట్ సహా ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాటర్లను వేదాంత్ పెవిలియన్ చేర్చడం విశేషం.
అనంతరం ఢిల్లీ తరఫున కెప్టెన్ ఆర్యవీర్ ఓపెనర్‌గా బరిలోకి దిగి సంయమనంతో ఆడాడు. కొత్త బంతిని సమర్థంగా ఎదుర్కొంటూ 94 బంతుల్లో 31 పరుగులు సాధించాడు. ఇటీవలే ముగిసిన అండర్-19 ఆసియా కప్‌లో ఆర్యవీర్ 361 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును గెలుచుకున్నాడు. అంతేకాకుండా ఐపీఎల్ 2027 వేలం రిజిస్ట్రేషన్ జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. బ్యాట్‌తో అన్న మెరుపులు మెరిపిస్తుంటే.. బంతితో తమ్ముడు మాయ చేస్తూ సెహ్వాగ్ వారసత్వాన్ని ఘనంగా ముందుకు తీసుకెళ్తున్నారు.