- డీలిమిటేషన్‌కు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లు త్వరలోనే రాబోతోందన్న అర్వింద్
- ‘కోటి ఓట్లు - 90 సీట్లు’ అన్న కాంగ్రెస్ నినాదం బాగుందని ఎద్దేవా
- కాంగ్రెస్ నాయకులకు త్వరలోనే అసలు వాస్తవాలు తెలుస్తాయని వ్యాఖ్య
తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ జరిగి తీరుతుందని, ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ బిల్లు త్వరలోనే రాబోతోందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజకీయాలు, సాగునీటి ప్రాజెక్టులు, రాబోయే ఎన్నికల అంశాలపై ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.
వచ్చే ఎన్నికల్లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమాపై అర్వింద్ వ్యంగ్యంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ చెబుతున్న 'కోటి ఓట్లు - 90 సీట్లు' అనే నినాదం వినడానికి బాగుందని, అయితే అదంతా కేవలం భ్రమ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ నాయకులకు అసలు వాస్తవం ఏమిటో స్పష్టంగా తెలిసి వస్తుందని వ్యాఖ్యానించారు.
ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీపైనా విమర్శలు గుప్పించారు. కృష్ణా, గోదావరి నదీ జలాలను ఏపీ తరలించుకుపోవడానికి బీఆర్ఎస్ పార్టీనే కారణమని ఆరోపించారు.