- ఒకటి కంపెనీ, మరొకటి తాను వ్యక్తిగతంగా ఇస్తామన్న మస్క్
- 'ట్రంప్ అకౌంట్ల'లో ఉన్న చిన్నారులకు ఈ షేర్ల కేటాయింపు
- భవిష్యత్ ఆర్థిక వ్యవస్థలో ప్రజలకు వాటా ఇవ్వడమే లక్ష్యమన్న ఎలాన్ మస్క్
ప్రముఖ ఏరోస్పేస్ సంస్థ స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. అమెరికాలోని ప్రతి చిన్నారికి రెండు స్పేస్‌ఎక్స్ షేర్లు అందిస్తామని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో వెల్లడించారు. ఈ రెండు షేర్లలో ఒకటి కంపెనీ తరఫున, మరొకటి తాను వ్యక్తిగతంగా అందిస్తామని మస్క్ స్పష్టం చేశారు.
స్పేస్‌ఎక్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్రతి 'ట్రంప్ అకౌంట్'కు కంపెనీ కొత్తగా ఒక క్లాస్ ఏ కామన్ స్టాక్ షేర్‌ను కేటాయిస్తుంది. దీనికి సమానంగా మస్క్ కూడా వ్యక్తిగతంగా మరో షేర్‌ను జోడిస్తారు. అయితే, మస్క్ వ్యక్తిగతంగా ఇచ్చే షేర్లకు కూడా ట్రంప్ అకౌంట్లతో సంబంధం ఉంటుందా? లేదా వాటికి ఏవైనా లాకప్ పీరియడ్ నిబంధనలు వర్తిస్తాయా? అనే దానిపై స్పేస్‌ఎక్స్ నుంచి తక్షణ స్పందన రాలేదు.
గత నెలలో కూడా మస్క్ ఇలాంటి ప్రకటనే చేశారు. వచ్చే ఏడాది అమెరికాలోని ప్రతి చిన్నారికి తన స్పేస్‌ఎక్స్ షేర్లలో ఒకటి ఇస్తానని పేర్కొన్నారు. అంతకుముందు అక్టోబర్‌లో, స్పేస్‌ఎక్స్ ప్రెసిడెంట్ గ్విన్ షాట్‌వెల్, ఆమె భర్త కూడా ట్రంప్ కార్యక్రమం కింద 2 మిలియన్లకు పైగా పిల్లలకు తమ స్పేస్‌ఎక్స్ షేర్లను ఇస్తామని ప్రతిజ్ఞ చేశారు.
"భవిష్యత్ ఆర్థిక వ్యవస్థలో వాటాలుగా ఉండే షేర్లను నేరుగా ప్రజలకు అందించడమే సరైన మార్గం" అని మస్క్ తన తాజా పోస్ట్‌లో అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం ద్వారా భవిష్యత్తులో ప్రజలకు ఆర్థికంగా భాగస్వామ్యం కల్పించాలనే తన ఆలోచనను పంచుకున్నారు.