- 15 రోజుల్లోగా బేషరతు క్షమాపణకు అల్టిమేటం
- పుస్తకంలోని 201, 443 పేజీల్లోని అంశాలపై అభ్యంతరం
- సావర్కర్‌ను బ్రిటీష్ ఇన్ఫార్మర్ అన్నారని ఆగ్రహం
- ఇందిరా గాంధీ సావర్కర్‌ను దేశభక్తుడిగా గుర్తించారని వెల్లడి
- గడువులోగా స్పందించకుంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరిక
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ న్యాయ వివాదంలో చిక్కుకుంది. ఆమె రచించిన ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంలో స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌ను బ్రిటీష్ ఇన్ఫార్మర్గా పేర్కొనడంపై ఆయన కుటుంబం భగ్గుమంది. చరిత్రను వక్రీకరిస్తూ సావర్కర్ గౌరవానికి భంగం కలిగించారని ఆరోపిస్తూ ఆయన మనవడు సాత్యకి సావర్కర్ లీగల్ నోటీసులు పంపారు. 15 రోజుల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని, పుస్తకంలోని తప్పుడు రాతలను సరిచేయాలని అల్టిమేటం జారీ చేశారు. గడువులోగా స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
న్యాయవాది సంగ్రామ్ కోల్హట్కర్ ద్వారా పంపిన ఈ నోటీసులో పుస్తకంలోని 201, 443 పేజీల్లోని అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. బ్రిటిష్ పాలకుల చేతుల్లో కాంగ్రెస్ నాయకులు జైలు శిక్షలు అనుభవిస్తున్న సమయంలో సావర్కర్ లాంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలు బ్రిటీష్ వారికి క్షమాభిక్ష పిటిషన్లు రాసుకున్నారని 201వ పేజీలో రాశారు. అంతేకాదు బ్రిటీష్ అధికారులతో చేతులు కలిపి ఇన్ఫార్మర్లుగా పనిచేశారనే భావన వచ్చేలా పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్య సమరయోధులకు వ్యతిరేకంగా సావర్కర్ పనిచేశారనే తప్పుడు అభిప్రాయాన్ని పాఠకుల్లో కలిగించేలా ఈ రాతలు ఉన్నాయని సాత్యకి సావర్కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
అండమాన్ సెల్యులార్ జైలులో సావర్కర్ అనుభవించిన కఠిన నిర్బంధాన్ని, శారీరక హింసను కావాలనే పక్కనపెట్టారని నోటీసులో పేర్కొన్నారు. నాటి చారిత్రక పరిస్థితులను, నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పిటిషన్ల అంశాన్ని మాత్రమే ప్రస్తావించడం పూర్తి దురుద్దేశపూరితమని అభిప్రాయపడ్డారు. అలాగే పుస్తకంలోని 443వ పేజీలో సావర్కర్ హిందూత్వ సిద్ధాంతాన్ని సైతం అత్యంత సంకుచితంగా, వక్రీకరించి చూపించారని ఆరోపించారు. ఈ రెండు పేజీల్లోని రాతలు చదివితే సావర్కర్ పాత్రపై పాఠకులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాలను సావర్కర్ కుటుంబం గుర్తుచేసింది. ఇందిర స్వయంగా సావర్కర్ దేశభక్తిని గుర్తించారని తెలిపారు. ఆమె హయాంలోనే సావర్కర్ గౌరవార్థం స్మారక తపాలా బిళ్లను విడుదల చేశారని గుర్తుచేశారు. అంతేకాదు స్వతంత్రవీర్ సావర్కర్ జాతీయ స్మారక ట్రస్టుకు ఇందిరా గాంధీ తన సొంత బ్యాంకు ఖాతా నుంచి రూ.11 వేల విరాళం అందించినట్లు తెలిపారు. అత్తగారు దేశభక్తుడిగా గౌరవించిన వ్యక్తిపై కోడలు సోనియా గాంధీ ఇలాంటి నిరాధార ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. చారిత్రక ఆధారాలు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. లేదంటే చేసిన తప్పును అంగీకరిస్తూ లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలన్నారు.