- ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- 'నషా ముక్త్ భారత్' ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానం
- 'హైదరాబాద్ వాక్స్' ప్రచార టీషర్ట్‌లను ఆవిష్కరించిన ప్రభాస్
- మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం గళమెత్తాలని పిలుపు
దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘నషా ముక్త్ భారత్’ ఉద్యమంలో భాగస్వామ్యం కావాల్సిందిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఆహ్వానం అందింది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నేడు ప్రభాస్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇవాళ హైదరాబాద్ లో ప్రభాస్ నివాసానికి వెళ్లిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా నిర్వహిస్తున్న డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
సమాజంలో, ముఖ్యంగా యువతలో డ్రగ్స్ వినియోగంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రభాస్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంయుక్తంగా 'హైదరాబాద్ వాక్స్ – నషా ముక్త్ భారత్' (Hyderabad Walks – Nasha Mukt Bharat) కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యేక టీషర్ట్‌లను ఆవిష్కరించారు.
దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలనే ప్రధాన సందేశాన్ని ఈ ప్రచారం చాటిచెబుతోంది. ఈ సందర్భంగా "మాదకద్రవ్యాల రహిత భారత్ కోసం మనమందరం గళమెత్తుదాం!" అంటూ పిలుపునిచ్చారు. యువతలో విపరీతమైన అభిమానం ఉన్న ప్రభాస్ వంటి అగ్ర నటుడు ఈ అవగాహన ఉద్యమానికి మద్దతు తెలపడం ద్వారా సమాజంలో మరింత సానుకూల ప్రభావం పడుతుందని భావిస్తున్నారు.