- అంబర్‌పేట నుంచి ముషీరాబాద్‌కు కిషన్ రెడ్డి డ్రగ్స్ వ్యతిరేక పాదయాత్ర
- డ్రగ్స్ రహిత భారత్ కోసం హైదరాబాద్‌లో చైతన్య యాత్ర.. వెంకటేశ్ సంఘీభావం
- మూడు రోజుల పాటు 30 కిలోమీటర్లు.. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా భారీ వాకథాన్
హైదరాబాద్‌లో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ మూడు రోజుల అవగాహన పాదయాత్ర కాసేపటి క్రితం ఘనంగా ప్రారంభమైంది. అంబర్‌పేట మహంకాళి ఆలయ మైదానం నుంచి మొదలైన ఈ చైతన్య యాత్రలో ప్రముఖ సినీ నటుడు దగ్గుబాటి వెంకటేశ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సహా పలువురు ప్రముఖులు, పెద్ద సంఖ్యలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.
తొలిరోజు ఈ పాదయాత్ర అంబర్‌పేట టీ జంక్షన్, తిలక్‌నగర్, ఫీవర్ హాస్పిటల్, విద్యానగర్, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్, సీతాఫల్‌మండి, చిలకలగూడ, పద్మారావునగర్, గాంధీ ఆస్పత్రి మీదుగా ముషీరాబాద్‌లోని కాశిష్ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగనుంది. పాదయాత్ర సాగే మార్గాల్లో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అవసరమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... డ్రగ్స్ వల్ల ఏ తండ్రీ తన కొడుకు భవిష్యత్తు నాశనమవడం చూడకూడదని, యువత భవిష్యత్తును కాపాడటం మనందరి ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేశారు.
మత్తు పదార్థాల వినియోగం యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని సినీ నటుడు వెంకటేశ్ పిలుపునిచ్చారు.
2029 నాటికి దేశాన్ని సంపూర్ణ డ్రగ్స్ రహిత భారత్‌గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈరోజు నుంచి 27వ తేదీ వరకు మొత్తం 30 కిలోమీటర్ల మేర సాగే ఈ పాదయాత్ర శుక్రవారం జూబ్లీహిల్స్‌లో ముగియనుంది.