బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌ వివాదంపై పరివర్తన రాజనీతి పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదం వైసీపీ అధినేత జగన్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలల వ్యక్తిగత అంశమని ఆయన స్పష్టం చేశారు. 

గతంలో వైఎస్ కుటుంబానికి ఆడిటర్‌గా పనిచేసిన నేపథ్యం ఉన్నందున తనకు ఆ ఆస్తికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసని విజయసాయి రెడ్డి తెలిపారు. అయితే, ఈ అంశంపై తాను మాట్లాడనని చెప్పారు.

"బెంగళూరులోని యలహంక ప్యాలెస్‌ వివాదం జగన్, షర్మిలకు మాత్రమే సంబంధించిన అంశం. గతంలో వారివద్ద ఆడిటర్‌గా పనిచేసిన నాకు ఆ ప్యాలెస్‌ వివరాలన్నీ తెలుసు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉద్దేశమేంటన్నది ఆయన కుటుంబసభ్యులకు, నాకు, కేవీపీకి మాత్రమే తెలుసు. ఇది వాస్తవం. ఈ అంశంపై ఒకవేళ కోర్టు నాకు సమన్లు పంపితే.. తప్పకుండా వాస్తవాలు చెప్పాల్సిందే" అని స్పష్టం చేశారు.