- పంచాయతీ ఎన్నికల్లో అధికార కూటమి అరాచకాలకు పాల్పడుతోందన్న విడదల రజని
- ఎన్నికలు పారదర్శకంగా జరిగితే టీడీపీ ఓటమి ఖాయమని వ్యాఖ్య
- రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపణ
ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజని మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అధికార కూటమి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయమని ఆమె పేర్కొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగి గెలిస్తే.. దాన్ని గెలుపు అంటారు. పారదర్శకంగా ఎన్నికలు జరిగితే టీడీపీ ఓటమి ఖాయం. పంచాయతీ ఎన్నికల్లో అరాచకాలు సృష్టిస్తున్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది. ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారు’’ అని విమర్శించారు.
నామినేషన్ల స్వీకరణ ప్రక్రియపై కూడా ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత దారుణమైన, దుర్మార్గమైన ఎన్నికలు ఎప్పుడు చూడలేదు. అభ్యర్థులు ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేయాలంటే కోర్డు ఆర్డర్ కావాలా? కోర్టు నుంచి ఆర్డర్ వస్తేనే అభ్యర్థుల చేత నామినేషన్ దాఖలు చేయిస్తామని ఎలక్షన్ అధికారులు, పోలీసులు చెప్పటం సిగ్గుచేటు’’ అని రజని మండిపడ్డారు. ప్రజలకు చూపించడానికి ప్రభుత్వానికి ఏమీ లేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే గందరగోళం సృష్టిస్తున్నారని ఆమె ఆరోపించారు.