- ఇండోనేసియా క్యాండీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
- ప్రమాదంలో 24 మంది మృతి.. 30 మందికి పైగా గల్లంతు
- ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అనుమానం
- గుర్తుపట్టలేని విధంగా కాలిపోయిన మృతదేహాలు
- మృతుల గుర్తింపు కోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్న అధికారులు
ఇండోనేసియాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వెస్ట్ జావా ప్రావిన్స్‌లోని ఓ క్యాండీ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటల్లో 24 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో 30 మంది ఆచూకీ గల్లంతైంది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. సెరాంగ్ రీజెన్సీ పరిధిలోని సికాండేలో ఉన్న పీటీ ఫోనుసా అగుంగ్ ములియా ఫ్యాక్టరీలో శనివారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 300 మంది కార్మికులు షిఫ్టులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎయిర్ కండిషనర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు కార్మిక సమస్యలపై అధ్యక్షుడి సలహాదారు సయీద్ ఇక్బాల్ తెలిపారు. విచారణ నిమిత్తం ఫ్యాక్టరీ సీఈఓను పిలిపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రమాద స్థలంలో ఇంకా మంటలు ఆర్పివేయని హాట్‌స్పాట్‌లు ఉండటం, భవనం నిర్మాణం బలహీనపడటంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని రెస్క్యూ ఏజెన్సీ హెడ్ అల్ అమ్రాద్ తెలిపారు. ఈ ప్రమాదం నుంచి 29 మంది సురక్షితంగా బయటపడగా, వారిలో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 24 మృతదేహాలను వెలికితీశారు.
మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతదేహాలను చూసి గుర్తించడం అసాధ్యంగా మారిందని పోలీస్ అధికారిణి వాహ్ యు హిదాయతి తెలిపారు. మృతుల బంధువుల నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించి, వాటి ద్వారా గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామని, దీనికి రెండు నుంచి మూడు వారాల సమయం పట్టొచ్చని వివరించారు.