- వేలంలో భారీ ధర పలికిన అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ మూడు వెంట్రుకలు
- సౌత్ కరోలినాలో జరిగిన వేలంలో ఈ కేశాలు 4,000 డాలర్లు పలికాయి
- వాషింగ్టన్‌తో స్నేహంగా ఉన్న జాన్ గాడ్స్‌బీ అనే వ్యక్తికి ఇవి అందినట్లు చారిత్రక ఆధారాలు
- గతంలో వాషింగ్టన్ వెంట్రుకలు 40,000 డాలర్లకు అమ్ముడుపోవడం గమనార్హం
- కొనుగోలుదారు వివరాలను గోప్యంగా ఉంచిన వేలం సంస్థ
అమెరికా తొలి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్‌కు చెందిన చిన్న ఫ్రేమ్ చేసిన మూడు వెంట్రుకలు వేలంలో 4,000 డాలర్లకు (రూ.3.7లక్షలు) అమ్ముడయ్యాయి. రిచ్‌మండ్ ఆక్షన్స్ సంస్థ శనివారం ఈ వేలంపాటను నిర్వహించింది. అయితే, ఈ చారిత్రక జ్ఞాపికను కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచినట్లు బీబీసీ తన కథనంలో పేర్కొంది.
ఈ వెంట్రుకల వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. 1799లో, జార్జ్ వాషింగ్టన్ తన మరణానికి కొద్దిరోజుల ముందు, వర్జీనియాలోని తన స్నేహితుడైన జాన్ గాడ్స్‌బీ ఇంట్లో విందుకు హాజరయ్యారు. ఆ సమయంలో స్నేహానికి గుర్తుగా వాషింగ్టన్ తన వెంట్రుకలను గాడ్స్‌బీకి బహుమతిగా ఇచ్చారు. గాడ్స్‌బీ కుటుంబం దీనిని ఒక ఫ్రేమ్‌లో ఉంచి, వాషింగ్టన్ చిత్రపటం కింద తమ ఇంట్లో ప్రదర్శించేవారని ఆయన మనవరాలు 1928లో రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు.
అనంతరం గాడ్స్‌బీ వారసుల నుంచి జాన్ కే లాటిమర్ అనే కలెక్టర్ ఈ ఫ్రేమ్‌ను కొనుగోలు చేశారు. తాజాగా దానిని వేలంలో విక్రయించారు. అయితే, వాషింగ్టన్ వెంట్రుకలకు ఇది అత్యధిక ధర కాదు. 2021లో ఆయనకు చెందిన వెంట్రుకలతో కూడిన లాకెట్ ఒకటి దాదాపు 40,000 డాలర్లకు (రూ.37లక్షలు) అమ్ముడై రికార్డు సృష్టించింది.
అమెరికా స్వాతంత్య్ర సంగ్రామంలో సైన్యాన్ని నడిపించి, రాజ్యాంగ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన వాషింగ్టన్‌కు చెందిన వస్తువులకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ఆయనకు చెందిన 50కి పైగా వెంట్రుకల లాక్‌లను ఆయన నివాసమైన మౌంట్ వెర్నాన్ మ్యూజియంలో భద్రపరిచారు. ఈ ఏడాది జులైలో ఆయన సంతకం చేసిన ఒక లేఖ వేలంలో 1,09,800 డాలర్లు పలికింది.