- వికారాబాద్ జిల్లాలో ఆటోను ఢీకొట్టిన లారీ
- ఆటోలోని నలుగురు అక్కడికక్కడే మృతి
- మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తింపు
తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లాలోని బుగ్గ రామేశ్వరం వద్ద వేగంగా వచ్చిన ఓ లారీ, ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ నగేష్‌తో పాటు అందులో ప్రయాణిస్తున్న చంద్రమ్మ, పార్వతమ్మ, సరిత అక్కడికక్కడే మృతి చెందారు.
వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారని, పెండ్లిముడుగు గ్రామం నుంచి పనుల నిమిత్తం కేరెళ్లికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. మలుపు వద్ద లారీ అతివేగంగా, అజాగ్రత్తగా రావడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.