- హిందూపురం ఆసుపత్రికి కోవిడ్ సామగ్రి అందించిన చిత్తూరు యువకుడు వరుణ్
- అప్పట్లో యువకుడిని ఇంటికి పిలిపించిన బాలకృష్ణ
- పక్కనే కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా భోజనం పెట్టిన వైనం
- కోవిడ్ సమయంలో 20 వేల మంది వలస కార్మికులను ఆదుకున్న వరుణ్
- సేవ చేసిన యువకుడిని గుర్తించి గౌరవించిన బాలకృష్ణ పెద్ద మనసు
ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సేవా గుణానికి, ఆయనలోని కృతజ్ఞతా భావానికి నిదర్శనంగా నిలిచే ఒక ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. కోవిడ్ సంక్షోభ సమయంలో తన నియోజకవర్గ ప్రజలకు అండగా నిలిచిన చిత్తూరుకు చెందిన యువకుడు వరుణ్‌ను బాలకృష్ణ స్వయంగా ఇంటికి ఆహ్వానించి, ఆప్యాయంగా ఆతిథ్యం ఇచ్చారు. ఈ విషయాన్ని సదరు యువకుడు తాజాగా వెల్లడించాడు.
కరోనా మహమ్మారి విజృంభించిన విపత్కర పరిస్థితుల్లో వరుణ్ హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన పీపీఈ (PPE) కిట్లు, మాస్కులు, ఇతర అత్యవసర వైద్య సహాయక సామగ్రిని స్వచ్ఛందంగా సమకూర్చారు. ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బంది బాలకృష్ణ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ, హిందూపురం ప్రజల కోసం యువకుడు చేసిన సాయాన్ని బాలకృష్ణ ఏమాత్రం మర్చిపోలేదు.
సరిగ్గా నెలరోజుల తర్వాత బాలకృష్ణ కార్యాలయం నుంచి వరుణ్‌కు ఫోన్ వచ్చింది. బాలకృష్ణ స్వయంగా తనను కలవాలని కోరుకుంటున్నారని తెలియజేయడంతో వరుణ్ ఆయన నివాసానికి వెళ్లారు. అక్కడ వరుణ్‌కు మరపురాని ఆతిథ్యం లభించింది. బాలకృష్ణ స్వయంగా వరుణ్‌ను ఎంతో ఆదరంగా ఆహ్వానించి, తన పక్కనే కూర్చోబెట్టుకుని ప్రేమగా భోజనం వడ్డించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. "మా వాళ్లకు అవసరానికి కోవిడ్ మెటీరియల్ ఇచ్చావ్.. నీకు భోజనం కూడా పెట్టకపోతే ఎలా? నువ్వు తినకపోతే ఎలా?" అంటూ ఎంతో ఆత్మీయంగా పేర్కొన్నారు. బాలకృష్ణ చూపిన ప్రేమాభిమానాలు, సాదర ఆతిథ్యం వరుణ్‌ను ఎంతగానో కదిలించాయి.
చిత్తూరుకు చెందిన వరుణ్ గతంలోనూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కోవిడ్ సమయంలో సుమారు 20 వేల మంది వలస కార్మికులకు స్వయంగా ఆహారం అందించి ఆకలి తీర్చారు. కరోనా కష్టకాలంలో ఎందరికో వివిధ రూపాల్లో సహాయం అందించారు. అంతేకాకుండా, ఇటీవల బెంగళూరులో జరిగిన ఒక ప్రమాదంలో చిక్కుకున్న 8 మందిని రక్షించి తన సమయస్ఫూర్తిని, సేవాభావాన్ని చాటుకున్నారు. బాలకృష్ణ ఆనాడు తనకు ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చిన విషయాన్ని వరుణ్ తాజాగా అందరితో పంచుకున్నాడు. దాంతో, బాలయ్య మంచి మనసు మరోసారి వెలుగులోకి వచ్చింది.