- తునికి చెందిన యాచకురాలు నర్సియమ్మ దాతృత్వం
- భిక్షాటన చేస్తూ ఆలయాలకు లక్షల విరాళాలు
- విశ్వేశ్వర స్వామి ఆలయానికి రూ.50 వేలు అందజేత
- ధారాలమ్మ గుడికి రూ.లక్ష విరాళం సమర్పణ
- స్థానిక శివాలయానికి రూ.50 వేల విరాళం
- శ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారికి బంగారు కళ్లు
తలదాచుకోవడానికి సొంత గూడు లేదు... చేతిలో చిల్లిగవ్వ ఆస్తిపాస్తులు లేవు... ఆలయాల ముంగిట భిక్షాటన చేస్తూ రోజూ వచ్చే కొద్దిపాటి డబ్బులతోనే ఆమె జీవితం నడుస్తోంది. కానీ ఆమె సంకల్పం ముందు కోటీశ్వరుల దాతృత్వం కూడా చిన్నబోయింది. కాకినాడ జిల్లా తునికి చెందిన నర్సియమ్మ అనే వృద్ధురాలు తన దాతృత్వంతో అందరినీ విస్మయానికి గురిచేస్తున్నారు. రోజూ భిక్షాటన ద్వారా వచ్చే అతి స్వల్ప మొత్తంలో కడుపు నింపుకోగా మిగిలిన రూపాయి రూపాయిని జాగ్రత్తగా పొదుపు చేసి గుళ్లూ గోపురాలకు లక్షల రూపాయలు విరాళంగా సమర్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
తునిలోని ధారాలమ్మ ఆలయ ప్రాంగణంలో తన కుమారుడితో కలిసి నివసిస్తున్న నర్సియమ్మ, స్థానిక గుళ్ల వద్ద యాచిస్తూ జీవనం సాగిస్తున్నారు. సంపాదన పరిమితమే అయినా దైవభక్తిలో మాత్రం ఆమెది ఎవరూ చేరుకోలేని ఉన్నత శిఖరం. కార్తీకమాసం సందర్భంగా తుని గాంధీ సత్రంలోని అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి ఆలయానికి తాజాగా రూ.50 వేల నగదును విరాళంగా అందజేశారు.
గతంలోనూ ఆమె తన ఔదార్యాన్ని చాటుకున్నారు. తునిలోని ప్రసిద్ధ ధారాలమ్మ ఆలయానికి ఏకంగా రూ.లక్ష, స్థానిక శివాలయానికి రూ.50 వేలు విరాళంగా సమర్పించారు. అంతేకాకుండా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో వెలసిన భ్రమరాంబిక అమ్మవారికి బంగారు కళ్లు చేయించి సమర్పించడం ఆమె నిష్కల్మష భక్తికి నిదర్శనం. ఆస్తులు, అంతస్తులు ఉన్నవారు సైతం చేయలేని దానధర్మాలను ఒక యాచకురాలై ఉండి ఆచరించి చూపుతుండటంతో స్థానికులు ఆమె భక్తిప్రపత్తులను చూసి ఆశ్చర్యపోతున్నారు. దానం చేయడానికి జేబులో డబ్బుల కంటే గుండెల్లో మంచి మనసుంటే చాలని నిరూపిస్తున్న నర్సియమ్మ గొప్పతనంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.