- చంద్రాపూర్ హైవేపై రోడ్డు దాటుతుండగా ఘటన
- గాయపడ్డ పులిని చుట్టుముట్టి వేధించిన స్థానికులు
- పులిని రెచ్చగొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
- చికిత్స నిమిత్తం ట్రీట్‌మెంట్ సెంటర్‌కు పులి తరలింపు
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఓ పులి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. నాగ్‌పూర్ హైవేపై సిందేవహి సమీపంలోని ఖాట్‌గావ్ ఫాటా వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. రోడ్డు దాటుతున్న పులిని ఓ కారు వేగంగా ఢీకొట్టడంతో అది కదలలేని స్థితిలో రోడ్డు పక్కకు పడిపోయింది.
వివరాల ప్రకారం.. నిన్న ఉదయం 10:15 గంటల సమయంలో బల్లార్‌పూర్‌కు చెందిన ఆశిష్ సుధాకర్ తన కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఖాట్‌గావ్ ఫాటా వద్ద ఓ పులి అకస్మాత్తుగా రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. తొలుత ఓ ద్విచక్ర వాహనంపైకి దూకిన ఆ పులి, వెంటనే కారుకు అడ్డురావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పులికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదం తర్వాత గాయపడిన పులి రోడ్డు పక్కన ఉన్న పొదల్లోకి వెళ్లి పడుకుంది. ఈ విషయం తెలిసి అక్కడికి పెద్ద సంఖ్యలో జనం గుమిగూడారు. గాయంతో బాధపడుతున్న పులిని చూసి జాలిపడాల్సింది పోయి, దానిని రెచ్చగొట్టేలా వింత శబ్దాలు చేస్తూ వేధించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జనం ఎంత రెచ్చగొట్టినా, ఆ పులి మాత్రం వారిపై దాడి చేయకుండా పొదల్లోనే ఉండిపోయింది.
ఈ సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పులికి ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం మెరుగైన వైద్యం కోసం చంద్రాపూర్‌లోని 'ట్రాన్సిట్ ట్రీట్‌మెంట్ సెంటర్'కు (టీటీసీ) తరలించారు. గాయపడిన వన్యప్రాణి పట్ల జనం ప్రవర్తించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.