- ఏఐ, డీప్‌ఫేక్‌ల ముప్పుపై చర్యలు కోరుతూ కేంద్రానికి చిరంజీవి విజ్ఞప్తి
- హోంమంత్రి అమిత్ షా సూచనల మేరకే ఈ చర్య
- కళాకారుల గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత అన్న మెగాస్టార్
ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్‌ఫేక్‌ల దుర్వినియోగంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర హోం, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలను ఉద్దేశించి రాసిన ఒక విజ్ఞాపన పత్రాన్ని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి అందజేశారు.
ఇటీవల హైదరాబాద్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చిరంజీవి తన కుమారుడు రామ్ చరణ్‌తో కలిసి భేటీ అయ్యారు. ఏఐ ద్వారా రూపొందిస్తున్న కంటెంట్ వల్ల కళాకారుల హక్కులు, గౌరవానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని ఆ సమావేశంలో వివరించారు. దీనిపై స్పందించిన అమిత్ షా, ఈ అంశాన్ని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తుందని, కఠినమైన నిబంధనలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి అధికారికంగా ఒక వినతిపత్రం సమర్పించాలని చిరంజీవికి సూచించారు.
అమిత్ షా సూచనల మేరకు చిరంజీవి ఈ వినతిపత్రాన్ని కిషన్ రెడ్డికి సమర్పించారు. అనంతరం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా చిరంజీవి స్పందిస్తూ.. "సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసి ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తానని కిషన్ రెడ్డి భరోసా ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు. కళాకారుల గౌరవం, గుర్తింపు, సృజనాత్మక హక్కులతో పాటు ప్రతి పౌరుడి భద్రతను కాపాడటం మనందరి సమిష్టి బాధ్యత. సాంకేతికత సృజనాత్మకతను పెంచాలి కానీ, గౌరవాన్ని నాశనం చేయకూడదు" అని పేర్కొన్నారు.