- తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ
- సర్వదర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం
- 31 కంపార్ట్మెంట్లలో స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు
- నిన్న రూ. 4.95 కోట్లుగా నమోదైన శ్రీవారి హుండీ ఆదాయం
- ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న 82,173 మంది భక్తులు
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సోమవారం ఉదయం నాటికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనం కోసం సుమారు 15 నుంచి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. వారాంతం కావడంతో భక్తులు తిరుమలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
నిన్న ఒక్కరోజే 82,173 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, వీరిలో 27,058 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు హుండీలో సమర్పించిన కానుకల ద్వారా రూ. 4.95 కోట్ల ఆదాయం సమకూరింది. అదేవిధంగా, ఆదివారం నాడు 4.21 లక్షల లడ్డూలను విక్రయించగా, 2.59 లక్షల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగినట్లు అధికారులు తెలిపారు.