- శామీర్పేట మండల పరిధిలోని పొన్నాల అడవుల్లో రాతి చిత్రాలు గుర్తింపు
- సుమారు 2500 నుంచి 5000 ఏళ్ల నాటివని పరిశోధకుల ప్రాథమిక అంచనా
- ఎరుపు రంగుతో గీసిన వేటగాళ్లు జంతువుల చిత్రాలు లభ్యం
- స్థానిక గుట్టపై వెలసిన గండి చిట్టారమ్మను పూజిస్తున్న గ్రామస్తులు
- చారిత్రక సంపదను పరిరక్షించాలని పురావస్తు శాఖకు పరిశోధకుల విజ్ఞప్తి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలంలోని పొన్నాల గ్రామ అటవీ ప్రాంతంలో అత్యంత ప్రాచీనమైన రాతి చిత్రాలు (Rock Art) వెలుగుచూశాయి. హైదరాబాద్ నగర శివార్లకు అతి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో వెలుగుచూసిన ఈ రాతి చిత్రాలు సుమారు 2,500 నుంచి 5,000 ఏళ్ల క్రితం నాటివని పరిశోధకులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మను) పరిశోధక విద్యార్థి కొండవీటి గోపి, వారసత్వ అన్వేషకుడు మహమ్మద్ నసీరుద్దీన్ స్థానికుల సహకారంతో ఈ చారిత్రక ప్రదేశాన్ని గుర్తించారు. పొన్నాల అటవీ ప్రాంతంలోని ఓ గ్రానైట్ రాతి గుహ పైకప్పు భాగంలో ఎరుపు రంగుతో (హెమటైట్/రెడ్ ఓకర్) వేసిన ఈ అద్భుత చిత్రాలు ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఈ రాతి ఆశ్రయంలో వివిధ రకాల మానవ, జంతు ఆకృతులు, సంకేతాలు ఉన్నాయి. ఆయుధాలు చేతబూనిన వేటగాళ్ల సమూహాలు, జంతువులపై స్వారీ చేస్తున్నట్లుగా ఉన్న మానవ ఆకారాలు గీతలతో రూపొందించారు. వీటితో పాటు పొడవైన కొమ్ములు కలిగిన దుప్పులు, జింకలు, మూపురం ఉన్న ఎద్దులు/అడవి దున్నలు వంటి జంతువుల బొమ్మలు ఉన్నాయి. కొన్ని జంతువుల శరీర అంతర్భాగాలను 'ఎక్స్-రే' శైలిలో చిత్రీకరించడం ఇక్కడి విశేషం. వీటితో పాటు నక్షత్రం లేదా సూర్యుడిని పోలిన ఆకృతులు, డమరుకం గుర్తులు, చతురస్రాలు, జిగ్జాగ్ వంపు గీతలు వంటి జ్యామితీయ నమూనాలు కూడా దర్శనమిస్తున్నాయి.
ఒకదానిపై మరొకటి ఉన్న రంగుల పొరలను బట్టి చూస్తే, వివిధ కాలాల్లో ఆదిమానవులు ఈ గుహను ఆవాసంగా ఉపయోగించుకున్నట్లు అర్థమవుతోంది. మధ్యరాతియుగం (మెసోలిథిక్) నుంచి బృహత్ శిలాయుగం లేదా ప్రారంభ చారిత్రక యుగం వరకు ఈ కళా సంప్రదాయం కొనసాగి ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, వీటి కచ్చితమైన కాలాన్ని నిర్ధారించేందుకు శాస్త్రీయ విశ్లేషణ, పిగ్మెంట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
ఈ ప్రదేశం స్థానిక ప్రజలకు ఎప్పటి నుంచో సుపరిచితమే కావడం గమనార్హం. ఇక్కడి కొండపై కొలువైన 'శ్రీ గండి చిట్టారమ్మ' దేవతను గ్రామస్తులు ఎంతోకాలంగా భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. అయితే ప్రకృతి వైపరీత్యాలు, ఎండ, వానల ప్రభావంతో పాటు మానవ నిర్లక్ష్యం వల్ల ఈ అమూల్యమైన రాతి చిత్రాలు దెబ్బతినే ముప్పు ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పురావస్తు శాఖ, వారసత్వ విభాగం, అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ ప్రదేశాన్ని డిజిటల్ పద్ధతిలో డాక్యుమెంట్ చేయాలని, తగిన రక్షణ చర్యలు చేపట్టి అధికారికంగా పరిరక్షించాలని వారు కోరారు.