- రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి కేసు నిందితుడు హేమంత్ జైలుకు తరలింపు
- కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స అనంతరం కోలుకోవడంతో వైద్యుల డిశ్చార్జ్
- భారీ పోలీసు బందోబస్తు నడుమ అనంతపురం జిల్లా జైలుకు తరలించిన పోలీసులు
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్‌ను పోలీసులు అనంతపురం జిల్లా జైలుకు తరలించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో చికిత్స పొందుతున్న అతడి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు డిశ్చార్జ్ చేశారు. దీంతో పోలీసులు అతడిని తమ అదుపులోకి తీసుకుని, భారీ బందోబస్తు మధ్య అనంతపురం జిల్లా జైలుకు తరలించి జ్యుడీషియల్ రిమాండ్‌కు అప్పగించారు.
కొన్ని రోజుల క్రితం పాఠశాల తరగతి గదిలోకి చొరబడిన హేమంత్... విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన మరో విద్యార్థికి కూడా గాయాలయ్యాయి. అనంతరం నిందితుడిని ఆత్మకూరు అటవీ ప్రాంతంలో పట్టుకునే క్రమంలో పోలీసులపై దాడికి యత్నించగా, ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హేమంత్‌కు అనంతపురం ఆసుపత్రిలో ఇన్ఫెక్షన్ కారణంగా కుడి కాలు తొలగించారు. అనంతరం ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడంతో పరిస్థితి విషమించి, నవంబర్ 13న మెరుగైన చికిత్స కోసం కర్నూలు జీజీహెచ్ కార్డియాలజీ ఐసీయూకు తరలించారు.
కర్నూలు ఆసుపత్రిలో ఐదు రోజుల ప్రత్యేక చికిత్స తర్వాత నిందితుడు కోలుకున్నాడు. ఈ సందర్భంగా కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. "నిందితుడి బీపీ, పల్స్ రేటు సాధారణ స్థితికి వచ్చాయని, కాలికి అయిన గాయం కూడా పూర్తిగా మానిందని ఆయన వెల్లడించారు." హేమంత్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన నివేదికను అనంతపురం న్యాయస్థానానికి సమర్పించనున్నారు. మరోవైపు దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ప్రస్తుతం బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటోంది. నిందితుడు జైలుకు చేరడంతో పోలీసులు తదుపరి దర్యాప్తును వేగవంతం చేశారు.