- భద్రాచలం లాడ్జిలో యువకుడిపై దాడి, మృతి
- ఆధార్, రూమ్ చార్జీల విషయమై చెలరేగిన వివాదం
- మృతుడు ఫుడ్ డెలివరీ వర్కర్ శరత్‌గా గుర్తింపు
- దాడికి పాల్పడిన నిందితులు పరారీ, పోలీసుల గాలింపు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ లాడ్జిలో జరిగిన దాడిలో తెల్లం శరత్ (22) అనే ఫుడ్ డెలివరీ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నిన్న రాత్రి ఈ విషాదకర సంఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. స్విగ్గీ, జొమాటో డెలివరీ పార్ట్నర్గా పనిచేస్తున్న శరత్, తన ఇద్దరు స్నేహితులతో కలిసి రామాలయం సమీపంలోని సత్యసాయి రెసిడెన్సీ అనే లాడ్జికి రూమ్ బుక్ చేసుకోవడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆధార్ కార్డు వెరిఫికేషన్, రూమ్ చార్జీల విషయమై లాడ్జి యాజమాన్యానికి చెందిన యువకులతో వాగ్వాదం మొదలైంది.
ఈ గొడవ తీవ్రం కావడంతో వారు శరత్‌పై దాడికి దిగారు. అతని ఛాతీ, ముఖంపై పిడిగుద్దులు కురిపించడంతో శరత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దాడి చేసిన యువకులే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే, శరత్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు.
శరత్ స్నేహితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రశాంతంగా ఉండే ఆలయ పట్టణంలో ఈ ఘటన జరగడం స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.