- ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 26 వరకు అవకాశం
- జనవరి 4 వరకు ఆలస్య రుసుముతో చెల్లింపులకు ఛాన్స్
- ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఫీజు మినహాయింపు
- ఆన్లైన్లో మాత్రమే ఫీజు చెల్లించాలని స్పష్టీకరణ
తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు (ఎస్‌ఎస్‌సీ 2027) రాయబోయే విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక సమాచారం అందించింది. పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ, సవరించిన నూతన షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఫీజు చెల్లింపు ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది.
సవరించిన షెడ్యూల్ ప్రకారం.. ఎలాంటి ఆలస్య రుసుము (లేట్ ఫీజు) లేకుండా నవంబర్ 26 వరకు పరీక్ష ఫీజును చెల్లించవచ్చు. ఆ గడువు ముగిసిన తర్వాత రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్ 8 వరకు అవకాశం కల్పించారు. రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 21 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 23 నుంచి జనవరి 4 వరకు ఫీజు చెల్లించేందుకు వెసులుబాటు కల్పించారు.
ఫీజుల వివరాలను పరిశీలిస్తే..
రెగ్యులర్ విద్యార్థులు మూడు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులు రాసేందుకు రూ.125 ఫీజుగా నిర్ణయించారు. మూడు సబ్జెక్టుల వరకు మాత్రమే రాసేవారు రూ.110 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేషనల్ కోర్సు విద్యార్థులు రెగ్యులర్ ఫీజుకు అదనంగా మరో రూ.60 చెల్లించాలి. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు పరీక్ష ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు.
పరీక్ష ఫీజు చెల్లింపు విధానంపై విద్యాశాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఫీజు మొత్తాన్ని అధికారిక వెబ్‌సైట్ bse.telangana.gov.in ద్వారా కేవలం ఆన్‌లైన్ పద్ధతిలోనే పాఠశాల లాగిన్ ఉపయోగించి చెల్లించాల్సి ఉంటుంది. మాన్యువల్ ఐఎఫ్‌ఎంఎస్ (IFMS) చలాన్లు లేదా బ్యాంకుల ద్వారా నేరుగా తీసే ఫిజికల్ చలాన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోమని స్పష్టం చేసింది. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల వివరాలను పరిశీలించి, నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.