- ఫోన్ ఇవ్వకుండా ఈఎంఐలు వసూలు చేసిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ స్టోర్
- బాధితుడికి అనుకూలంగా హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ తీర్పు
- ఫోన్ ఖరీదుతో పాటు భారీ పరిహారం చెల్లించాలని ఆదేశం
- డెలివరీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయిన యాజమాన్యం
- బాధితుడి లోన్ ఖాతాను వెంటనే పూర్తిగా క్లోజ్ చేయాలని స్పష్టీకరణ
మొబైల్ ఫోన్ డెలివరీ చేయకుండానే ఈఎంఐలు కట్ చేసుకున్న ఒక ఎలక్ట్రానిక్స్ దుకాణదారు తీరుపై హైదరాబాద్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాపార సంస్థ నిర్లక్ష్యాన్ని, సేవా లోపాన్ని తప్పుపడుతూ బాధితుడికి పరిహారం చెల్లించాలని, ఫోన్ ఖరీదును వాపస్ ఇవ్వడంతో పాటు సంబంధిత లోన్ ఖాతాను పూర్తిగా రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే.. 2024 మార్చి నెలలో హైదరాబాద్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి జీరో పర్సెంట్ వడ్డీ ఈఎంఐ స్కీమ్ కింద కొత్త మొబైల్ ఫోన్ తీసుకునేందుకు ఒక ఎలక్ట్రానిక్స్ స్టోర్‌ను సంప్రదించాడు. అవసరమైన పత్రాలను సమర్పించగా, ఫైనాన్స్ కంపెనీ రుణాన్ని ఆమోదించి నిధులను విడుదల చేశాక ఫోన్ అందజేస్తామని స్టోర్ సిబ్బంది చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే స్టోర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు ఫోన్ డిస్పాచ్ ప్రాసెస్ కోసమంటూ అతని నుంచి ఓటీపీని తీసుకున్నారు. అయితే, ఎంత ఎదురుచూసినా ఫోన్ మాత్రం డెలివరీ కాలేదు. దీనిపై నిలదీయగా.. త్వరలోనే ఫోన్ పంపిస్తామని లేదా డబ్బులు రిఫండ్ చేస్తామని నిర్వాహకులు కాలయాపన చేశారు.
ఈ క్రమంలోనే ఫోన్ చేతికి రాకముందే, 2024 ఏప్రిల్ 3న బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి మొదటి ఈఎంఐ కింద రూ.4,204 కట్ అయింది. ఆ తర్వాత కూడా ప్రతినెలా ఈఎంఐలు కట్ అవుతూనే ఉన్నాయి. చేతిలో ఫోన్ లేకపోయినా ఈఎంఐలు చెల్లించాల్సి రావడంతో బాధితుడు మానసిక ఆవేదనకు గురయ్యాడు. స్టోర్ యాజమాన్యం నుంచి సరైన స్పందన లేకపోవడంతో జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు.
ఈ పిటిషన్‌పై స్టోర్ యాజమాన్యం స్పందిస్తూ.. కొనుగోలు చేసిన రోజే కస్టమర్‌కు ఫోన్ ఇచ్చేశామని, ఫైనాన్స్ సంస్థ చెల్లింపులను ధ్రువీకరించిన తర్వాతే బిల్లు జారీ అయిందని వాదించింది. ఈ లోన్ వ్యవహారంతో తమకు నేరుగా సంబంధం లేదని పేర్కొంది. అంతేకాకుండా, లోన్లు తీసుకుని ఎలక్ట్రానిక్స్ వస్తువులను ఇతరులకు అమ్ముకునే ముఠాతో బాధితుడికి సంబంధాలున్నాయని, దీనిపై పోలీసు విచారణ అవసరమని ఆరోపించింది.
రెండు వైపులా వాదనలు విన్న కమిషన్.. దుకాణదారు వాదనలను పూర్తిగా తోసిపుచ్చింది. బాధితుడికి మొబైల్ డెలివరీ చేసినట్లుగా స్టాక్ రిజిస్టర్ ఎంట్రీ, గేట్ పాస్ లేదా రసీదుపై అతని సంతకం వంటి ఎలాంటి ఆధారాలను స్టోర్ సమర్పించలేకపోయిందని గుర్తించింది. అలాగే కస్టమర్‌పై చేసిన మోసం ఆరోపణలను రుజువు చేసేందుకు ఎలాంటి ఎఫ్ఐఆర్ లేదా చార్జిషీట్ వంటివి లేవని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో రిటైలర్ తప్పును నిర్ధారించిన కమిషన్ కీలక ఆదేశాలు ఇచ్చింది. మొబైల్ ఫోన్ అసలు ధర రూ.74,698ను బాధితుడికి వాపస్ చేయాలని, మానసిక వేదనకు గురిచేసినందుకు రూ.30,000 నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కింద రూ.10,000 చెల్లించాలని స్పష్టం చేసింది. మొత్తం కలిపి రూ.1,14,698 బాధితుడికి చెల్లించడంతో పాటు, అతని పేరు మీద ఉన్న లోన్ ఖాతాను పూర్తిగా క్లోజ్ చేయాలని ఆదేశించింది. ఈఎంఐ లావాదేవీల్లో సరైన డెలివరీ ఆధారాలు లేకపోతే వ్యాపారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది.