- రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ధర్మ దీక్షలకు పిలుపు
- కాంగ్రెస్ ఎన్నికల హామీని గుర్తు చేస్తూ ఉద్యోగుల ఆందోళన
- 2.15 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొనే అవకాశం
పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలనే డిమాండ్‌తో తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరోసారి పోరుబాట పట్టారు. ఇందులో భాగంగా మంగళవారం (17న) రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవు పాటించనున్నట్లు తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీజీసీపీఎస్ఈయూ) ప్రకటించింది. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ 'ధర్మ దీక్షలు' చేపట్టనున్నట్లు తెలిపింది.
యూనియన్ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ, 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెన్షన్ విధానంపై ఇచ్చిన హామీకి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.60 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉండగా, అత్యవసర సేవల విభాగంలో పనిచేస్తున్న 45,000 మందికి మినహాయింపు ఇచ్చారు. మిగిలిన 2.15 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 1.50 లక్షల మందికి పైగా ఉద్యోగులు సామూహిక సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారని యూనియన్ వెల్లడించింది.
ఈ డిమాండ్‌పై యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వరీ శ్రీకాంత్ నేతృత్వంలోని బృందం ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాను కలిసి వినతిపత్రం సమర్పించింది. తమ జీతం నుంచి 11.5 శాతం సీపీఎస్‌కు జమ చేస్తున్నప్పటికీ, పదవీ విరమణ తర్వాత పెన్షన్, వైద్య భద్రతపై తీవ్ర అనిశ్చితి నెలకొందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల తరహాలో తక్షణమే చర్యలు తీసుకోవాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హామీని నిలబెట్టుకోవాలని వారు కోరారు.
సీపీఎస్ ఉద్యోగుల సామూహిక సెలవుకు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో పాటు పలు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ప్రకటించాయి. నల్గొండలో జరిగే ధర్మ దీక్షలో శ్రీపాల్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు పాల్గొని విజయవంతం చేయాలని యూనియన్ పిలుపునిచ్చింది. ఈ ఆందోళన కారణంగా నవంబర్ 17న అత్యవసరం కాని ప్రభుత్వ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.