- రాష్ట్రంలో కరవు నివారణ చర్యల కోసం రూ.30 వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని విజ్ఞప్తి
- ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నమోదైన 17 శాతం లోటు వర్షపాతంపై ప్రధానికి వివరణ
- ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్, ఖేలో ఇండియా క్రీడలకు ప్రధానికి ఆహ్వానం
ఢిల్లీలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ, కరవు పరిస్థితులను అధిగమించడానికి, రైతులను ఆదుకోవడానికి తక్షణమే రూ.30 వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్యాకేజీ రూపంలో అందించాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ భేటీలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం తీవ్రంగా పడిపోయిన తీరును ముఖ్యమంత్రి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు రాష్ట్రంలో సుమారు 17 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు వివరించారు.
రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు గాను 31 జిల్లాల్లోని 365 మండలాలను ఇప్పటికే కరువు ప్రాంతాలుగా ప్రకటించిన విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రధానికి తెలియజేశారు. ఇందులో 111 మండలాలు తీవ్ర కరవు బారిన పడగా, 254 మండలాలు మధ్యస్థాయి కరవును ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. వర్షాభావం కారణంగా ఖరీఫ్ సీజన్ సాగు విస్తీర్ణం 139.28 లక్షల ఎకరాల నుంచి 126.06 లక్షల ఎకరాలకు తగ్గిపోయిందని వివరించారు.
కరవు సహాయక చర్యలతో పాటు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న దీర్ఘకాలిక సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు, నిధుల కేటాయింపులపై కూడా చర్చించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’తో పాటు ‘ఖేలో ఇండియా’ క్రీడల ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని ముఖ్యమంత్రి ఆహ్వానించారు.