- మైక్రోసాఫ్ట్ 365 సేవల అంతరాయంపై ప్రాథమిక నివేదిక విడుదల
- సాఫ్ట్వేర్ లోపం, భారీ డేటా ట్రాఫిక్ వల్లే సమస్య
- తీవ్ర ప్రభావానికి గురైన 80 శాతానికి పైగా సర్వర్లు
- వినియోగదారులకు క్షమాపణలు తెలిపిన మైక్రోసాఫ్ట్ యాజమాన్యం
- త్వరలోనే సమగ్ర నివేదిక విడుదల చేస్తామని వెల్లడి
ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ 365 సేవలు భారీగా స్తంభించిపోవడానికి గల కారణాలను టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధికారికంగా వెల్లడించింది. నెట్వర్కింగ్ వ్యవస్థలోని ఒక అంతర్గత సాఫ్ట్వేర్ లోపం (హిడెన్ సాఫ్ట్వేర్ ఫ్లా), సర్వర్లపై ఒక్కసారిగా పెరిగిన భారీ ట్రాఫిక్ మరియు సర్వర్ల సామర్థ్యం తగ్గడం.. ఈ మూడు ప్రధాన అంశాల కలయిక వల్లే ఈ తీవ్ర అంతరాయం ఏర్పడిందని సంస్థ స్పష్టం చేసింది.
నవంబర్ 12న చోటుచేసుకున్న ఈ సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ టీమ్స్, వన్‌డ్రైవ్, షేర్‌పాయింట్, ఆఫీస్ అప్లికేషన్ల సేవలకు తీవ్ర విఘాతం కలిగింది. ఈ పరిణామంపై మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సోషల్ మీడియా వేదికగా వినియోగదారులకు క్షమాపణలు చెబుతూ ప్రాథమిక విచారణ వివరాలను పంచుకున్నారు.
మైక్రోసాఫ్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. మైక్రోసాఫ్ట్ 365 సర్వీసులను అనుసంధానించే ఫ్రంట్-ఎండ్ నెట్వర్కింగ్ వ్యవస్థలో ఈ సమస్య మొదలైంది. ఒక నిర్దిష్ట పరిస్థితిలో సర్వర్లు ఓవర్‌లోడ్ అయి స్పందించకుండా పోవడానికి అక్కడ దాగివున్న సాఫ్ట్వేర్ లోపం కారణమైంది. వాస్తవానికి ఈ కోడ్ మార్పును జూలై నెలలోనే ప్రవేశపెట్టారు. దాదాపు మూడు నెలల పాటు ఇది ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేసింది. సాధారణ టెస్టింగ్ ప్రక్రియలో ఉపయోగించిన హార్డ్‌వేర్, ట్రాఫిక్ పద్ధతులు రియల్-వరల్డ్ వ్యవస్థలకు భిన్నంగా ఉండటం వల్ల ఈ లోపం ముందే బయటపడలేదు.
అయితే, సర్వీసుల అంతరాయానికి సుమారు 15 గంటల ముందు టీమ్స్ ట్రాఫిక్‌ను బ్యాకప్ వ్యవస్థ నుంచి ప్రధాన వ్యవస్థకు మార్చడంతో నెట్‌వర్క్‌పై ఒక్కసారిగా రద్దీ పెరిగింది. దీనికితోడు అంతకుముందు రోజు ఎదురైన మరో సాంకేతిక సమస్య వల్ల దాదాపు 14 శాతం సర్వర్ల సామర్థ్యం అందుబాటులో లేకుండా పోయింది. ఈ కారణాలు ఒక్కటైనా పెద్దగా ప్రభావం చూపేవి కావు కానీ, రెండూ ఒకేసారి తోడవడంతో దాగివున్న సాఫ్ట్వేర్ లోపం తీవ్రరూపం దాల్చింది. అమెరికా పీక్ ట్రాఫిక్ వేళ విపరీతంగా రిక్వెస్టులు పేరుకుపోయి సర్వర్లు స్తంభించిపోయాయి.
పరిస్థితి విషమించిన సమయంలో ఏకంగా 80 శాతానికి పైగా సర్వర్లు స్పందించడం మానేశాయి. వినియోగదారులను ఇతర సర్వర్లకు మళ్లించేందుకు ఆటోమేటిక్ వ్యవస్థలు ప్రయత్నించినప్పటికీ, అదనపు లోడ్ కారణంగా అవి కూడా మొరాయించి చైన్ రియాక్షన్ ఏర్పడింది. సమస్యను ఒకే ప్రాంతానికి పరిమితం చేసే అంతర్గత భద్రతా వ్యవస్థలు కూడా విఫలమవడంతో సమస్య ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. చివరికి ఇంజనీర్లు లోపభూయిష్టమైన కోడ్‌ను గుర్తించి, సరికొత్త అప్డేట్ ద్వారా వ్యవస్థను తిరిగి గాడిన పెట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు, భవిష్యత్ కార్యాచరణతో కూడిన పూర్తి నివేదికను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.