- చైనా ప్రభుత్వ విమానయాన సంస్థ కోమాక్ మరో ఘనత
- సీఈ-25ఏ ఎలక్ట్రిక్ విమానం తొలి పైలటెడ్ పరీక్ష విజయవంతం
- ఇద్దరు పైలట్లు, ఒక ఇంజనీర్‌తో గాల్లోకి దూసుకెళ్లిన విమానం
- పట్టణాల మధ్య ప్రయాణానికి ఈ విమానం రూపకల్పన
- 19 మంది ప్రయాణికులతో 400 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం
విమానయాన రంగంలో చైనా మరో కీలక మైలురాయిని అధిగమించింది. ప్రభుత్వ రంగ సంస్థ ‘కోమాక్’ అభివృద్ధి చేసిన పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాణిజ్య విమానం ‘సీఈ-25ఏ’ తొలిసారిగా విజయవంతంగా గాల్లోకి ఎగిరింది. షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని బిన్జౌ నగరంలో శనివారం ఈ చరిత్రాత్మక ప్రయోగాన్ని నిర్వహించారు.
ఈ ప్రయోగాత్మక పరీక్షలో ఇద్దరు పైలట్లు, ఒక ఫ్లైట్-టెస్ట్ ఇంజనీర్ పాలుపంచుకున్నారు. మొత్తం 57 నిమిషాల పాటు సాగిన ఈ ప్రక్రియలో, విమానం 16 నిమిషాలకు పైగా నింగిలో విహరిస్తూ 60.4 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. విమాన పనితీరు సంతృప్తికరంగా ఉందని, అన్ని వ్యవస్థలు నిర్దేశిత లక్ష్యాల మేరకు పనిచేశాయని కోమాక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కాగా, ఈ విమానం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే తొలి మానవరహిత ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది.
ప్రధానంగా సమీప నగరాల మధ్య ప్రయాణాల కోసం ఈ విమానాన్ని రూపొందించారు. ఇది 19 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. గరిష్టంగా 10 టన్నుల బరువుతో టేకాఫ్ అయ్యే సామర్థ్యం దీనికి ఉంది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ విమానం, గరిష్టంగా 400 కిలోమీటర్ల రేంజ్ కలిగి ఉంటుంది. రెక్కలకు అమర్చిన 10 ఎలక్ట్రిక్ డక్టెడ్ ఫ్యాన్ల సాయంతో ఇది పనిచేస్తుంది.
ప్రముఖ బ్యాటరీ తయారీ సంస్థ సీఏటీఎల్, షాంఘై జియావో టాంగ్ యూనివర్సిటీ వంటి భాగస్వామ్య సంస్థలతో కలిసి కోమాక్ ఈ విమానాన్ని అభివృద్ధి చేసింది. ఇది పైలట్ల పర్యవేక్షణతో పాటు అటానమస్ (స్వయంచాలిత) మోడ్‌లోనూ పనిచేయగలదు. ఈ విమానానికి ‘టైప్ సర్టిఫికెట్’ మంజూరు చేయాలని కోరుతూ కోమాక్ చేసిన దరఖాస్తును చైనా సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే ఆమోదించింది.