- బంగాళాఖాతంలో వాయుగుండం
- రేపటికి తుపానుగా, ఎల్లుండికి తీవ్ర తుపానుగా మారే అవకాశం
- రాగల రెండు రోజుల్లో ఏపీ తీరం వైపు కదిలే ఛాన్స్
- నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తాంధ్రలో అత్యంత భారీ వర్షాలు
- తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి ప్రస్తుతం ఆగ్నేయ, దానిని ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
వాతావరణ శాఖ వివరాల ప్రకారం, ఈ వాయుగుండం నవంబర్ 16 నాటికి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలు, పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని తుపానుగా మారనుంది. ఆ తర్వాత నవంబర్ 17 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా బలపడనుంది. అనంతరం మరింత తీవ్రరూపం దాల్చి, రాగల రెండు రోజుల్లో వాయవ్య దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ తీరం వైపునకు దూసుకువచ్చే అవకాశముంది. ఇది తుపానుగా మారితే దీనిని 'అక్వాన్' అని పిలవనున్నారు.
ఈ తుపాను ప్రభావంతో నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 18 నుంచే కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు ప్రారంభమవుతాయి. రాయలసీమలో నవంబర్ 19, 20 తేదీల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
తెలంగాణలోనూ నవంబర్ 20న పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడులో నవంబర్ 18, 19 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒడిశాలో నవంబర్ 19 నుంచి 21 వరకు భారీ వర్షాలు నమోదయ్యే వీలుంది.
నవంబర్ 18 నుంచి 20 వరకు కోస్తాంధ్ర, యానాం, తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం నెలకొంటుంది. నవంబర్ 20న తెలంగాణలోనూ బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.