- ఐఐటీ రూర్కీలో 20 ఏళ్ల విద్యార్థి ఆయుష్ రజౌరియా మృతి
- నవంబర్ 13న జరగాల్సిన 70 పరీక్షలు నవంబర్ 22కు వాయిదా
- హాస్టల్ గదిలో లభ్యమైన లేఖ.. డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు వెల్లడి
- గత ఏడాది కాలంగా క్యాంపస్ వెల్‌నెస్ సెంటర్‌లో కౌన్సెలింగ్
- ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ఉత్తరాఖండ్‌లోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఐఐటీ రూర్కీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒక విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడంతో క్యాంపస్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఊహించని పరిణామంతో నవంబర్ 13న జరగాల్సిన సుమారు 70 సెమిస్టర్ పరీక్షలను యాజమాన్యం తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ పరీక్షలను తిరిగి నవంబర్ 22న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మార్పులకు సంబంధించిన వివరాలను విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అధికారికంగా తెలియజేసింది.
మృతి చెందిన విద్యార్థిని ఘజియాబాద్‌లోని రాజ్‌నగర్ ఎక్స్‌టెన్షన్‌కు చెందిన 20 ఏళ్ల ఆయుష్ రజౌరియాగా గుర్తించారు. ఆయన ఐఐటీ రూర్కీలో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ విభాగంలో బీఎస్-ఎంఎస్ (BS-MS) రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో గోవింద్ భవన్ హాస్టల్‌లోని రెండో అంతస్తులో ఉన్న గది నంబర్ బీఎస్ 10 లో ఆయుష్ అచేతనంగా పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలంలో ఒక లేఖ లభ్యమైనట్లు సమాచారం. అందులో తాను తీవ్రమైన డిప్రెషన్, మానసిక వేదనతో బాధపడుతున్నట్లు ఆయుష్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు అతడు గత ఏడాది కాలంగా క్యాంపస్‌లోని వెల్‌నెస్ సెంటర్‌లో నిపుణుల వద్ద కౌన్సెలింగ్ తీసుకుంటున్నారని అధికారులు వెల్లడించారు.
ఆయుష్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పోస్ట్‌మార్టం నివేదిక, లేఖ ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై ఐఐటీ రూర్కీ యాజమాన్యం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. కాగా, ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యం, వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లపై ఈ దుర్ఘటన మరోసారి చర్చకు దారితీసింది.