- తిరుమలలో వరుస నేరాలకు పాల్పడుతున్న గోగుల శ్రీకాంత్
- శ్రీకాంత్‌పై హత్యాయత్నం సహా ఐదు క్రిమినల్ కేసులు నమోదు
- ఎస్పీ సుబ్బరాయుడు ప్రతిపాదనలతో కలెక్టర్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు
- నిందితుడిని కడప సెంట్రల్ జైలుకు తరలించిన అధికారులు
తిరుమల పరిసర ప్రాంతాల్లో వరుస నేరాలకు పాల్పడుతూ ప్రజలను, భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒక నిందితుడిపై తిరుపతి జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్న గోగుల శ్రీకాంత్ అలియాస్ కన్నా (27) పై ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ యాక్ట్, 1986 (పీడీ యాక్ట్) కింద కేసు నమోదు చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితుడు శ్రీకాంత్‌పై తిరుమల పరిధిలో 2024 నుంచి 2026 మధ్య కాలంలో మొత్తం 5 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో దొంగతనాలు, హత్యాయత్నం, అల్లర్లకు పాల్పడటం, మారణాయుధాలతో దాడులు చేయడం, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకోవడం వంటి తీవ్రమైన నేరాలు ఉన్నాయి. వరుసగా కేసులు నమోదవుతున్నప్పటికీ నిందితుడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని పోలీసులు గుర్తించారు.
సాధారణ చట్టాల కింద కేసులు నమోదు చేసినా అతడి నేర ప్రవృత్తి ఆగకపోవడంతో పాటు, తిరుమలలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తుండటంతో పీడీ యాక్ట్ ప్రయోగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పంపిన నివేదిక, ప్రతిపాదనలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, శ్రీకాంత్‌పై పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వుల అమలు అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించినా, భక్తులను భయభ్రాంతులకు గురిచేసినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, ఇలాంటి అసాంఘిక శక్తులపై చట్టప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.