- విశాఖ సీఐఐ సదస్సులో చంద్రబాబు వ్యాఖ్యలపై వివాదం
- మీకు మసాలా కావాలి, మాకు ఫలితాలు కావాలి అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు!
- చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన విజయ్ నేతృత్వంలోని టీవీకే
- తమిళనాడు పారిశ్రామిక ప్రగతి తరతరాల శ్రమ ఫలితమన్న సత్యకుమార్
- 2027 దావోస్ సదస్సు వేదికగా ఫలితాలు తేల్చుకుందామంటూ బహిరంగ సవాల్
- పెట్టుబడులు ఉద్యోగాల కల్పనలో తమిళనాడే నంబర్ వన్ అవుతుందన్న ధీమా
విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన "మసాలా" వ్యాఖ్యలు ఇప్పుడు రెండు పొరుగు రాష్ట్రాల మధ్య పారిశ్రామిక, రాజకీయ చర్చకు దారితీశాయి. తమిళనాడుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన విషయంలో ఏ రాష్ట్రం ముందుందో 2027 దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికపై తేల్చుకుందామంటూ ఏపీ ప్రభుత్వానికి టీవీకే నేరుగా బహిరంగ సవాల్ విసిరింది.
విశాఖ సదస్సులో పరిశ్రమల తరలింపు అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ.. మీకు 'మసాలా' కావాలి, మాకు మాత్రం ఫలితాలు కావాలి అని చిరునవ్వుతో వ్యాఖ్యానించారు. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ సహజమని, పెట్టుబడిదారులకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కడ ఉంటే అక్కడికే వెళతారని ఆయన పేర్కొన్నారు. పారిశ్రామిక పునాది బలపడే వరకే ఆరంభంలో ఇచ్చే రాయితీలు అవసరమని, ఆ తర్వాత వాటిని తగ్గిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వ పారిశ్రామిక విధానాల వల్ల ఏపీకి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు.
చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై టీవీకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన స్థాయికి ఇలాంటి వ్యాఖ్యలు తగవని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, సీనియర్ న్యాయవాది సత్యకుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లను ఉద్దేశించి ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు పారిశ్రామిక రంగం కేవలం ఆర్భాటం కాదని, నాణ్యమైన విద్య, సాంకేతికత, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, తరతరాల శ్రమతో నిర్మితమైందని ఆయన గుర్తుచేశారు. అటువంటి వ్యవస్థను తేలిగ్గా "మసాలా" అంటూ కొట్టిపారేయడం సరికాదన్నారు.
2027 జనవరిలో జరిగే దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు నాటికి ఏ రాష్ట్రం ఎన్ని పెట్టుబడులు సాధించింది, ఎంతమందికి ఉపాధి కల్పించిందో స్పష్టమైన లెక్కలతో చూసుకుందామని సత్యకుమార్ సవాల్ చేశారు. విజయ్ నాయకత్వంలో తమిళనాడును దేశంలోనే పెట్టుబడుల ఆకర్షణలో అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా సరికొత్త పారిశ్రామిక విధానాలతో ముందుకు వెళుతున్నామని తెలిపారు.
తమిళనాడు ఆత్మగౌరవం, సమాఖ్య స్ఫూర్తి, పెరియార్, అన్నాదురైల సామాజిక న్యాయ సిద్ధాంతాలపై ఆధారపడి నడుస్తుందని ఆయన పేర్కొన్నారు. తిరుక్కురళ్‌ను ఉటంకిస్తూ, తాము సిద్ధాంతాలపై రాజీపడే ప్రసక్తే లేదని, బీజేపీతో ఎలాంటి పొత్తులు లేకుండానే అభివృద్ధి సాధిస్తామని స్పష్టం చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సినీ ప్రస్థానం మద్రాసుతో ముడిపడి ఉండటం, ఎంజీఆర్‌తో ఆయనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మాటలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో వచ్చే పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన ఫలితాల ఆధారంగానే ఎవరు ముందో తేల్చుకుందామని టీవీకే స్పష్టం చేసింది.