'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' ఫ్రాంచైజీకి విపరీతమైన క్రేజ్ ఉంది. ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్ నుంచి వచ్చిన ఈ సిరీస్, యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. అలాంటి ఈ సిరీస్ నుంచి పలకరిస్తూ ఇప్పుడు 'ఆఫ్టర్ ది డార్క్' వచ్చింది. ఇంతవరకూ క్యాంపస్ లోని అల్లర్లు .. అలకలు చూపిస్తూ వచ్చిన ఈ సిరీస్, ఇప్పుడు ఒక మర్డర్ మిస్టరీతో కూడిన కంటెంట్ ను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చింది. షనాయా కపూర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సిరీస్, ఈ నెల 13వ తేదీ నుంచి 6 ఎపిసోడ్స్ తో 8 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
బాగా పేరున్న ఒక స్కూల్లో 'అయేషా మాలిక్' (షనాయా కపూర్) చదువుతూ ఉంటుంది. చాలా తెలివైన స్టూడెంట్ గా ఆమెను గురించి చెప్పుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటూ ఉంటుంది. అలాంటి ఆమె ఆ స్కూల్ కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'బారాఖలి' సరస్సులో శవమై తేలుతుంది. అంతరాత్రి వేళ ఆమె అంత దూరం ఎందుకు వెళ్లింది? ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? అనేది మిస్టరీగా మారుతుంది. అయేషా మరణం ఆమె కుటుంబ సభ్యులను కుంగదీస్తుంది.
అయేషా మరణం గురించి ఆమె స్కూల్ యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయకపోవడం .. స్నేహితులతో ఎవరూ స్పందించకపోవడం అయేషా కవల చెల్లెలు అతిథి (షనాయా కపూర్)కి అనుమానం కలిగిస్తుంది. దానికితోడు అయేషాకి సాధ్యమైనంత త్వరగా అంత్యక్రియలు చేయమని పోలీస్ వారు ఒత్తిడి చేస్తుండటం కూడా ఆమె అనుమానం బలపడటానికి కారణమవుతుంది. తన అక్కయ్య మరణం వెనుక ఏదో రహస్యం దాగి ఉందనీ, అదేంటో తెలుసుకోవాలని భావించిన అతిథి, అంత్యక్రియలు జరపకుండా ఆపేస్తుంది.
అయేషా చనిపోవడానికి గల కారణాలను తెలుకోవాలంటే, తాను అదే స్కూల్లో చేరాలని అతిథి నిర్ణయించుకుంటుంది. అతిథిని ఆ స్కూల్లో చేర్చుకుంటే, అయేషా మరణం గురించి మీడియాతో మాట్లాడనని ఆమె తల్లి స్కూల్ యాజమాన్యంతో చెబుతుంది. దాంతో స్కూల్ యాజమాన్యం అందుకు అంగీకరిస్తుంది. ఆ స్కూల్లో చేరిన మరుసటి రోజు నుంచే, తన ప్లాన్ ను అతిథి ఆచారణలో పెడుతుంది.
ఆ స్కూల్ లో .. తన అక్కయ్య క్లాస్ మేట్స్ లో .. ప్రేమగా ఉన్నవారినీ, శత్రుత్వం ఉన్నవారిని ఆమె గుర్తిస్తుంది. ఆ రోజు నుంచి వారిని గమనించడం మొదలుపెడుతుంది. ఆ స్కూల్ లోని ఒక సీక్రెట్ బిల్డింగ్ లో ఒక సీక్రెట్ గేమ్ జరుగుతూ ఉంటుంది. ఆ గేమ్ కీ .. తన అక్కయ్య మరణానికి సంబంధం ఉందని అతిథి భావిస్తుంది. తాను కూడా ఆ గేమ్ లో పాల్గొంటూ అసలు నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అయేషా సూసైడ్ చేసుకుందా? హత్య చేయబడిందా? ఆమె శవంగా మారడానికి గల కారణాలు ఎలాంటివి? అనేది మిగతా కథ.
ఒక స్కూల్ లో చదువుతున్న తన అక్కయ్య అనుమానాస్పద స్థితిలో చనిపోతుంది. ఆమె మరణానికి సంబంధించిన విషయంలో యాజమాన్యం బాధ్యత తీసుకోకపోవడం, అసలు ఏం జరిగి ఉంటుందనేది తెలుసుకోవడానికి పోలీసులు పెద్దగా ఆసక్తిని కనబరచకపోవడం ఒక చెల్లెలుగా అతిథికి అనుమానాన్ని కలిగిస్తుంది. దాంతో నిజానిజాలు తెలుసుకోవడం కోసం రంగంలోకి దిగిన ఆమెకి, ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయనే దిశగా ఈ కథ వెళుతుంది.
తన అక్కయ్య చనిపోవడానికి గల కారణాలను .. కారకులను కనుక్కోవడానికి అతిథి ఆ స్కూల్లో చేరడం .. తన అక్కయ్య బ్రతికున్నప్పుడు ఆ స్కూల్లో ఎవరితో ఎలాంటి సంబంధాలు ఉండేవనేది ఆరాతీయడం .. ఆధారాలు సేకరించడం వంటి సన్నివేశాలతో ఆరంభంలో ఈ సిరీస్ ఆసక్తికరంగానే అనిపిస్తుంది. చివరికి ఏం జరుగుతుంది? ఏం తెలుస్తుంది? అనే ఒక క్యూరియాసిటీ ప్రేక్షకులలో ఉంటుంది.
అయితే స్కూల్లో సీక్రెట్ గేమ్ అంటూ ఒక ట్రాక్ ను సెట్ చేశారు. ప్రధానమైన కథతో ఇది ముడిపడి ఉంటుంది. చూడటానికి ఒక రియాలిటీ గేమ్ షో మాదిరిగా ఉంటుంది. ఈ గేమ్ కీ .. తన అక్కయ్య చనిపోవడానికి సంబంధం ఉందని అతిథి భావిస్తుంది. అంతరవకూ బాగానే ఉంది. అయితే అందుకు సంబంధించిన గేమ్స్ .. అంత ఆసక్తికరంగా ఏమీ అనిపించవు. పైగా అసలు కథకు ఈ గేమ్స్ అడ్డు తగిలినట్టుగా అనిపిస్తుంది కూడా.
స్టూడెంట్స్ పాత్రలలో అందరూ బాగానే చేశారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు. కానీ గేమ్స్ గందరగోళమే కాస్త ఇబ్బంది పెడుతుంది. అతిథికి కొంతమంది స్టూడెంట్స్ పై అనుమానం ఉండటం ... ఆ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి ఆమె చేసే ప్రయత్నాలు కుతూహలాన్ని రేకెత్తించలేకపోయాయి. అయితే చివర్లో ట్విస్ట్ మాత్రం ఆడియన్స్ గెస్ చేయలేని విధంగానే ఉంటుంది. కానీ ఆ ట్విస్ట్ కోసమని, స్టూడెంట్స్ మధ్య జరిగే గేమ్స్ ను భరిస్తూ వెళ్లాలి. యూత్ కి ఈ సిరీస్ ఓ మాదిరిగా అనిపించవచ్చునేమోగానీ, మిగతావారికి కాస్త కష్టంగానే అనిపిస్తుందని చెప్పాలి.

Series Details
Series Name: Student of the Year: After Dark
Genre: Thriller
Release Date: 13 Nov 2026
Cast: Shanaya Kapoor, Divik Sharma, Abhinav Singh, Manya Grover, Deeya Damini
Director: Reema Maya
Music: Achint Thakkar
Banner: Dharmatic Entertinment
Review By: Peddinti