- భారత్‌లో ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందన్న ప్రశాంత్ కిశోర్
- పెగాసస్ ద్వారా తన ఫోన్‌పైనా నిఘా పెట్టారని వెల్లడి
- రాహుల్ గాంధీ ఆరోపణల నేపథ్యంలో పీకే కీలక వ్యాఖ్యలు
- నిఘాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఫోన్ ట్యాపింగ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక వాస్తవమని, గతంలో పెగాసస్ స్పైవేర్ వివాదం తలెత్తిన సమయంలో తన ఫోన్‌పై కూడా నిఘా ఉంచారని ఆయన శుక్రవారం పేర్కొన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ఫోన్ ట్యాపింగ్‌కు గురవుతోందంటూ ఇటీవల చేసిన ఆరోపణల నేపథ్యంలో పాట్నాలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ప్రశాంత్ కిశోర్ సమాధానమిచ్చారు. "పెగాసస్ లక్ష్యంగా ఉన్న వ్యక్తుల జాబితాలో నా పేరు కూడా ఉన్నప్పుడే నా ఫోన్ ట్యాప్ అవుతోందన్న విషయం నాకు అర్థమైంది" అని ఆయన వివరించారు. దేశంలో ఇలాంటి నిఘా వ్యవస్థలు కొంతకాలంగా కొనసాగుతున్నాయని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రధాని నరేంద్ర మోదీ తన ఫోన్‌ను ట్యాప్ చేయిస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం విడుదల చేసిన ఒక వీడియో ప్రకటనలో ఆరోపించిన విషయం విదితమే. తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఫోన్లోనే ఉన్నాయని, దేశభక్తి, విదేశీ ప్రభావం వంటి అంశాలపై ప్రధానితో బహిరంగ చర్చకు తాను సిద్ధమని రాహుల్ సవాల్ విసిరారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇదే సమయంలో, బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరితో తన భేటీపై అడిగిన మరో ప్రశ్నకు కిశోర్ స్పందించారు. ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశానని, అంతమాత్రాన ప్రభుత్వంపై తన విమర్శనాత్మక వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని ఆయన స్పష్టం చేశారు.