- సీనియర్ నటుడు గిరిబాబు కన్నుమూత
- అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాదులో తుదిశ్వాస విడిచిన వైనం
- గిరిబాబు 600కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారన్న చంద్రబాబు
- గిరిబాబు మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్న మంత్రి నారా లోకేశ్
- గిరిబాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన నేతలు
ప్రముఖ సీనియర్ నటుడు, దర్శక-నిర్మాత గిరిబాబు మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ఒక సీనియర్ కళాకారుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ మేరకు ఇద్దరు నేతలు సోషల్ మీడియా వేదికగా ఆయన మృతికి నివాళులర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిబాబు సినీ ప్రస్థానాన్ని స్మరించుకుంటూ.. "ప్రముఖ సీనియర్ నటుడు, దర్శక నిర్మాత గిరిబాబు మరణం విచారకరం. ప్రకాశం జిల్లాలో ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించిన గిరిబాబు ఐదు దశాబ్దాల పాటు 600లకు పైగా చిత్రాల్లో నటించి... విలన్గా, హాస్యనటుడిగా ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను మెప్పించారు. గిరిబాబు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు.
మంత్రి నారా లోకేశ్ కూడా గిరిబాబు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ప్రముఖ తెలుగు సినీనటులు గిరిబాబు గారి మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. నాలుగు దశాబ్దాల పాటు 600కు పైగా సినిమాల్లో తనదైన నటనతో గిరిబాబు గారు తెలుగు ప్రేక్షకులను విశేషంగా అలరించారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరనిలోటు. గిరిబాబు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని లోకేశ్ తెలిపారు.