- ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 'ఓం' ట్రైలర్ విడుదల
- అండర్‌కవర్ ఆఫీసర్‌గా, కలప కూలీ వేషంలో ధనుశ్
- స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఐపీఎస్ ఆఫీసర్ గా సాయిపల్లవి
- స్మగ్లింగ్ సిండికేట్‌లో కీలక పాత్రలో మమ్ముట్టి
- నవంబర్ 20న పాన్-ఇండియా స్థాయిలో మూవీ విడుదల
ధనుశ్, సాయిపల్లవి, మమ్ముట్టి వంటి భారీ తారాగణం నటించిన బహుభాషా క్రైమ్ డ్రామా చిత్రం 'ఓం' ట్రైలర్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్, ప్రేక్షకుల అంచనాలను భారీగా పెంచుతోంది. దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్, సినిమాలోని ప్రధాన పాత్రలను, కథలోని ఉత్కంఠను పరిచయం చేసింది.
ఈ ట్రైలర్‌లో ధనుశ్ ఒక అండర్‌కవర్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఆర్గనైజ్డ్ క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారి అయిన ఆయన.. ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాలోకి చొరబడేందుకు ఒక సాధారణ కలప కూలీగా మారువేషంలో వెళతాడు. స్మగ్లింగ్ సిండికేట్ కార్యకలాపాలను బయటపెట్టేందుకు ఆయన చేసే ప్రయత్నాలు ఉత్కంఠ రేపుతున్నాయి.
మరోవైపు, సాయిపల్లవి ఐపీఎస్ ఆఫీసర్ నిత్యా రెడ్డి పాత్రలో పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్‌కు నాయకత్వం వహిస్తూ, ‘ఆపరేషన్ మోల్’ పేరుతో స్మగ్లర్ల ఆట కట్టించడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆమె యాక్షన్ అవతారంలో కనిపించారు. ఈ ఆపరేషన్ పేరు మీదే సినిమాకు 'ఓం' అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఇక, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా కీలక పాత్రలో కనిపించనుండగా, శ్రీలీల ధనుశ్ భార్య పాత్రలో నటించింది. ట్రైలర్‌లో హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, భారీ ఛేజింగ్‌లు, ధనుష్, సాయిపల్లవిల మధ్య సాగే జాయింట్ ఆపరేషన్ దృశ్యాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.