- ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు 58.1 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్
- గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఆధునిక ట్రాక్ నిర్మాణం
- కృష్ణా నదిపై 4.5 కిలోమీటర్ల మేర భారీ ఐకానిక్ వంతెన
- తాడికొండ సమీపంలో అమరావతి ప్రధాన రైల్వే స్టేషన్
- కొప్పురవూరు వద్ద 230 ఎకరాల్లో భారీ రైల్వే టెర్మినల్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి రైల్వే కనెక్టివిటీ కల్పించే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. అమరావతి మీదుగా వెళ్లే రైల్వే లైన్ రూట్, రాజధాని ప్రధాన రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసే ప్రదేశం, భారీ టెర్మినల్ ప్రాంతాన్ని రైల్వే శాఖ దాదాపు ఖరారు చేసింది. గతంలో రూపొందించిన ప్రణాళికల్లో కొన్ని మార్పులు చేస్తూ తాజా రూపురేఖలను సిద్ధం చేశారు. రాజధాని ప్రాంతానికి పటిష్ఠమైన రోడ్డు, రైలు రవాణా వ్యవస్థను అనుసంధానించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును వేగవంతం చేస్తున్నారు.
58.1 కిలోమీటర్ల మార్గం.. గంటకు 160 కిలోమీటర్ల వేగం
ఎర్రుపాలెం (ఖమ్మం జిల్లా), నంబూరు (ఉమ్మడి గుంటూరు జిల్లా) మధ్య నిర్మించనున్న కొత్త రైల్వే కారిడార్ పొడవును గతంలో ప్రతిపాదించిన 56.53 కిలోమీటర్ల నుంచి 58.1 కిలోమీటర్లకు సవరించారు. ఈ మార్గంలో గరిష్ఠంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు రాకపోకలు సాగించే విధంగా అత్యంత ఆధునిక సాంకేతికతతో ట్రాక్‌ను నిర్మించనున్నారు. ఈ మార్గంలో కృష్ణా నదిపై సుమారు 4.5 కిలోమీటర్ల పొడవైన అద్భుతమైన ఐకానిక్ వంతెన ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వీటితో పాటు మొత్తం 32 భారీ వంతెనలు, 92 చిన్న వంతెనలు, రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా 12 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు/అండర్ బ్రిడ్జిలు (ROB/RUB) నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు.
తాడికొండ సమీపంలో ప్రధాన స్టేషన్.. కొప్పురావూరులో మెగా టెర్మినల్
రాజధాని కోర్ క్యాపిటల్ ఏరియాలో భాగంగా, తాడికొండకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ప్రధాన అమరావతి రైల్వే స్టేషన్‌ను నిర్మించనున్నారు. దీనితో పాటు సుదూర ప్రాంతాల రైళ్ల నిర్వహణ కోసం కొప్పురావూరు వద్ద దాదాపు 230 ఎకరాల విస్తీర్ణంలో భారీ టెర్మినల్‌ను ప్రతిపాదించారు. 24 ఎల్‌హెచ్‌బీ (LHB) కోచ్‌లు కలిగిన భారీ రైళ్లను సులభంగా హ్యాండిల్ చేసేలా దీనిని తీర్చిదిద్దనున్నారు. ఈ టెర్మినల్‌లో 9 ప్రధాన ప్లాట్‌ఫామ్‌లు, 6 సైడ్ లైన్లు, రైళ్ల నిర్వహణకు అవసరమైన పిట్ లైన్లు, మరో 12 స్టీరింగ్ లైన్లు ఏర్పాటు కానున్నాయి. ఈ మెయింటెనెన్స్ హబ్, టెర్మినల్ నిర్మాణం కోసం అవసరమైన భూమిని కేటాయించాలని రైల్వే శాఖ ఇప్పటికే ఏపీ సీఆర్‌డీఏ (AP CRDA) ను కోరింది.
మార్గంలో ఏర్పాటయ్యే స్టేషన్లు
ఈ కొత్త రైల్వే మార్గంలో మొత్తం తొమ్మిది స్టేషన్లు రానున్నాయి. పెద్దపురం, చెన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపల్లి, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరు మీదుగా రైలు మార్గం సాగుతుంది. వీటిలో పెద్దపురం, పరిటాల, అమరావతి, కొప్పురావూరు స్టేషన్లను క్రాసింగ్ స్టేషన్లుగా అభివృద్ధి చేయనున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎర్రుపాలెం, నంబూరు స్టేషన్లను కీలక రైల్వే జంక్షన్లుగా మార్చనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే అమరావతి నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు వేగవంతమైన, అత్యాధునిక రైల్వే రవాణా సదుపాయం లభించనుంది.