- హైటెక్స్‌లో డిసెంబర్ 19 నుంచి 22 వరకు 85వ ఐఆర్‌సీ సదస్సు జరుగుతుందన్న కోమటిరెడ్డి
- నాలుగు రోజుల పాటు విస్తృతంగా జరగనున్న సాంకేతిక చర్చలు జరుగుతాయని వెల్లడి
- దేశవ్యాప్తంగా ఇంజినీర్లు, పరిశోధకులు, నిర్మాణ రంగ నిపుణులు హాజరవుతారన్న మంత్రి
హైదరాబాద్ వేదికగా ప్రతిష్ఠాత్మక 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) వార్షిక సదస్సు జరగనుంది. ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.
రహదారుల నిర్మాణం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పటిష్టమైన రోడ్డు వ్యవస్థల రూపకల్పనపై విజ్ఞాన పంపిణీ, ఆలోచనల మార్పిడి, వినూత్న విధానాల అన్వేషణకు ఈ ఐఆర్‌సీ సదస్సు ఒక కీలక వేదిక కానుందని మంత్రి పేర్కొన్నారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ సదస్సులో దేశం నలుమూలల నుంచి ఇంజినీర్లు, పరిశోధకులు, విద్యావేత్తలు, విద్యార్థులు, కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు, మెటీరియల్ తయారీదారులు పాల్గొని సాంకేతిక అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారని తెలిపారు.
ఈ నెల 19న ఐఆర్‌సీ 238వ కౌన్సిల్ సమావేశం, 20న జాతీయ రహదారుల పరిశోధనా మండలి 90వ సమావేశం జరగనున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా రోడ్డు నెట్‌వర్క్ నాణ్యతను పెంచేందుకు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు ఈ సమావేశాలు దోహదపడనున్నాయి. జాతీయ స్థాయి ప్రతినిధులు ఒకేచోట చేరి విధానపరమైన అంశాలపై చర్చించనుండటంతో హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ సదస్సుకు ప్రాధాన్యత ఏర్పడింది.