- మోత్కూరు మండలం అనాజిపురం వద్ద ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాన్వాయ్కి ప్రమాదం
- కాన్వాయ్‌లోని కారును వెనుక నుంచి వేగంగా ఢీకొట్టిన లారీ
- అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టిన ఫార్చ్యూనర్ వాహనం
- ప్రమాదంలో ఆరుగురికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
- పాదయాత్రలో నడుస్తుండటంతో సురక్షితంగా బయటపడ్డ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాదయాత్రలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం వద్ద ఆయన కాన్వాయ్‌లోని వాహనాన్ని వెనుక నుంచి ఓ లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటన సమయంలో మల్లన్న రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండటంతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
మోత్కూరు నుంచి తిరుమలగిరి వైపు మల్లన్న పాదయాత్ర సాగుతున్న క్రమంలో ఈ సంఘటన జరిగింది. కాన్వాయ్‌లోని వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ కారు అదుపుతప్పి, ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న కారులోని తిరుమలగిరికి చెందిన మేడబోయిన శ్రీనాథ్, ఆయన భార్య చందనలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అదే కారులో ఉన్న వారి రెండేళ్ల కుమారుడు, డ్రైవర్ సురేష్‌లతో పాటు కాన్వాయ్ కారులోని డ్రైవర్ బన్నీ, మల్లన్న అనుచరుడు రంగన్న కూడా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, మల్లన్న బృందం సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.