- హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన భారత్ సమ్మిట్ 2026
- అభివృద్ధి కేంద్రీకృతం కావడం తీవ్ర అసమతుల్యతకు నిదర్శనమన్న మహేశ్ కుమార్ గౌడ్
- ఆదిలాబాద్, ములుగు, నారాయణపేట వంటి జిల్లాల్లో పరిశ్రమలు నెలకొల్పాలని పిలుపు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే సమాన అభివృద్ధి, ఉపాధి అవకాశాల కోసమని, కానీ ప్రస్తుతం రాష్ట్ర ఆదాయంలో సుమారు 40 శాతం కేవలం హైదరాబాద్ నగరం నుంచే వస్తుండటం తీవ్రమైన అసమతుల్యతకు నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్లో ఈరోజు ప్రారంభమైన 'భారత్ సమ్మిట్-2026' సదస్సులో భాగంగా నిర్వహించిన 'తెలంగాణ రైజింగ్ - ఎకనామిక్ జస్టిస్' చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే అభివృద్ధి కేవలం రాజధాని నగరానికే పరిమితం కాకుండా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆదిలాబాద్, ములుగు, నారాయణపేట వంటి వెనుకబడిన జిల్లాల్లోనూ పరిశ్రమలు భారీగా ఏర్పాటు కావాలని, అప్పుడే సమగ్ర ఆర్థిక న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.
గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగితేనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, ఆదాయ వనరులు రాష్ట్రమంతటా విస్తరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాంతాల వారీగా ఉన్న వ్యత్యాసాలను తొలగించి, సమతుల్య అభివృద్ధి సాధించడమే తెలంగాణ అసలైన లక్ష్యమని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు సాగే ఈ భారత్ సమ్మిట్లో రాష్ట్ర ప్రగతి, ఆర్థిక న్యాయంపై పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.