- పోలీస్ కమిషనరేట్ లో పదవీ బాధ్యతలను స్వీకరించిన మహేశ్ భగవత్
- శాంతిభద్రతలు, మహిళా భద్రత, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యమని వెల్లడి
- భూ తగాదాలు, పదేపదే నేరాలకు పాల్పడేవారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరిక
హైదరాబాద్ నగర నూతన పోలీస్ కమిషనర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ భగవత్ బాధ్యతలు స్వీకరించారు. పోలీస్ కమిషనరేట్ లోని తన ఛాంబర్ లో సంబంధిత ఫైళ్లపై సంతకాలు చేసి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తనకు అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం నూతన సీపీ మహేశ్ భగవత్ మీడియాతో మాట్లాడుతూ తమ ప్రాధాన్యతలను స్పష్టం చేశారు. “హైదరాబాద్లో శాంతి భద్రతలు, మహిళా భద్రత, ట్రాఫిక్ వంటివి కీలక అంశాలు. ప్రతి ఏటా 1.80 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. అందుకే ఈ అంశాలకు మేము ప్రాధాన్యమిస్తాం. మరోవైపు భూమి విలువ పెరగడం వల్ల భూ తగాదాల్లో దాడులు జరుగుతున్నాయి. వీటిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
నగరంలో పదేపదే నేరాలకు పాల్పడే అలవాటున్న నేరగాళ్లపై అవసరమైతే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్లో సైబర్ నేరాల కట్టడి, డయల్ 100, 112 ఎమర్జెన్సీ సేవల బలోపేతం, విజిబుల్ పోలీసింగ్, కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను మరింత సమర్థంగా ముందుకు తీసుకెళతామని చెప్పారు.