- తమ్మిడికుంట చెరువును ప్రారంభించిన సీఎం
- చెరువు విస్తరణ కోసం 2 ఎకరాల స్థలాన్ని అందించిన నటుడు నాగార్జున
- 14 ఎకరాలకు కుంచించుకుపోయిన తమ్మిడి కుంటను 30 ఎకరాలకు విస్తరించిన ప్రభుత్వం
- నగరంలో చెరువుల పరిరక్షణతో పాటు లేక్ ఎకానమీని ప్రోత్సహిస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటన
- మూసీ నది పునరుజ్జీవనం ద్వారా నల్గొండ జిల్లా ప్రజల ఇబ్బందులు తొలగిస్తామని హామీ
"నిన్నటి వరకు అందరూ శిల్పారామం గురించే మాట్లాడుకున్నారు.. కానీ ఇవాళ్టి నుంచి తమ్మిడి కుంట గురించే మాట్లాడుకుంటారు. ఇకపై ఐటీ ఉద్యోగులు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కాదు.. ‘వర్క్ ఫ్రమ్ తమ్మిడికుంట’ అంటారు" అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నగరంలో ఆధునికీకరించిన తమ్మిడికుంట చెరువును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొంతమందికి తాత్కాలికంగా నష్టం జరిగినా, రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించాలన్న లక్ష్యంతోనే తమ్మిడికుంటను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు. ఒకప్పుడు ఆక్రమణలకు గురై కేవలం 14 ఎకరాలకు కుచించుకుపోయిన ఈ చెరువును, ఇప్పుడు 30 ఎకరాల విస్తీర్ణానికి పెంచినట్లు వివరించారు.
చెరువుల ఆక్రమణలతోనే కాలనీలు జలమయం
హైదరాబాద్ నగరం అంటేనే ‘రాక్స్ అండ్ లేక్స్ సిటీ’ అని సీఎం గుర్తుచేశారు. గతంలో నగరంలో 1372 చెరువులు ఉండేవని, కానీ వివిధ కారణాలు, ఆక్రమణల వల్ల దాదాపు 50 శాతం చెరువులు కనుమరుగైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులను కబ్జా చేయడం వల్లే కొద్దిపాటి వర్షం పడినా రోడ్లపైకి నీళ్లు రావడం, కాలనీలు చెరువులను తలపించడం జరుగుతోందని.. ఈ దుస్థితిపై సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. వందేళ్ల క్రితమే మూసీ వరదల నుంచి నగరాన్ని రక్షించడానికి నిజాం పాలకులు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించారని, ముచుకుందా నది.. మూసా, ఈసా సంగమంతో మూసీగా రూపాంతరం చెంది నదీ నాగరికతకు కేంద్రంగా మారిందని గుర్తుచేశారు.
మూసీ ప్రక్షాళన ఆగదు.. బాధితులకు అండగా ఉంటాం
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మూసీ తీవ్రంగా కలుషితమైందని, ఆ విషపు నీటి ప్రభావంతో నల్లగొండ జిల్లా ప్రజలు దశాబ్దాలుగా తీవ్ర అనారోగ్యాలతో శిక్ష అనుభవిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే మూసీ పునరుజ్జీవనం చేపట్టాలని సంకల్పించామని చెప్పారు. "మూసీకి కావాల్సింది కేవలం బాహ్య సుందరీకరణ కాదు.. దానికి పూర్తిస్థాయి పునరుజ్జీవం కల్పించడమే మా లక్ష్యం. ఈ ప్రక్రియలో ఏ ఒక్కరికీ అన్యాయం లేదా నష్టం జరగకుండా ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకుంటుంది. త్వరలోనే మూసీ పునరుజ్జీవం తొలి దశ పనులను ప్రారంభిస్తాం" అని వెల్లడించారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడాలని, నగరాభివృద్ధి కోసం అన్ని పక్షాలూ రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు.
‘లేక్ ఎకానమీ’ అభివృద్ధికి పెద్దపీట
నగరంలోని చెరువులను కాపాడుకుంటూనే వాటి చుట్టూ ‘లేక్ ఎకానమీ’ని ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తమ్మిడికుంట ప్రాంగణంలో ప్రజలకు పూర్తి భద్రత ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అలాగే చెరువు ఆవరణలో ఒక జమ్మి చెట్టును నాటాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు సూచించారు. అలా చేస్తే దసరా వంటి సంప్రదాయ వేడుకలకు చెరువులు కేంద్ర బిందువులుగా మారి, మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికి ఎంతగానో దోహదపడతాయని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.