- ఈ సదస్సుకు బడా పారిశ్రామికవేత్తలెవరూ హాజరుకాలేదన్న అమర్నాథ్
- సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి ఎలాంటి కొత్త పెట్టుబడులు రాలేదని వ్యాఖ్య
- గత రెండున్నరేళ్లలో వచ్చిన పరిశ్రమలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ కేవలం ప్రచారం కోసమేనని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ సమ్మిట్‌కు దేశంలోనే పేరెన్నికగన్న పెద్ద పారిశ్రామికవేత్తలు ఎవరూ హాజరుకాలేదని అమర్నాథ్ అన్నారు. దీనివల్ల రాష్ట్రానికి కొత్తగా ఎలాంటి పెట్టుబడులు రాలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన జరగదనే విషయం మరోసారి రుజువైందని పేర్కొన్నారు. గతంలో నిర్వహించిన సదస్సుల్లో కుదుర్చుకున్న ఒప్పందాలకు, క్షేత్రస్థాయిలో వాస్తవంగా ప్రారంభమైన పరిశ్రమలకు ఎలాంటి పొంతన లేదని విమర్శించారు. ప్రజాధనంతో ప్రచారం చేసుకోవడం చంద్రబాబు, లోకేశ్‌లకు ఆనవాయతీగా మారిందని మండిపడ్డారు.
గత రెండున్నరేళ్ల కాలంలో కుదుర్చుకున్న ఒప్పందాలు, వాస్తవంగా రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమల వివరాలతో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగలదా అని అమర్నాథ్ సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వం చెబుతున్న 20 లక్షల ఉద్యోగాలను ఎవరికి కల్పించారో స్పష్టమైన వివరాలు ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో జగన్ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, పోర్టులను కూడా తామే తెచ్చినట్లుగా ప్రస్తుత పాలకులు ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.