- స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఘన విజయం
- పోస్టల్ బ్యాలెట్లలో కూటమికి 63.6 శాతం ఉద్యోగుల మద్దతు తెలిపారన్న ఆలపాటి
- 10,715 మందికి పాత పెన్షన్ విధానం వర్తింపు అని వెల్లడి
- గత ప్రభుత్వం నిలిపివేసిన రూ.30,000 కోట్ల బకాయిల చెల్లించినట్టు వివరణ
- ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి కట్టుబడి ఉందని స్పష్టీకరణ
రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థాగత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయం ప్రభుత్వ పాలనకు లభించిన స్పష్టమైన ప్రజా రెఫరెండం అని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల పోస్టల్ బ్యాలెట్లలో ఏకంగా 63.6 శాతం మంది ఉద్యోగులు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారని ఆలపాటి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలను ప్రస్తావిస్తూ, అప్పట్లో దాదాపు రూ.40,000 కోట్ల బకాయిలు పెట్టి, రివర్స్ పీఆర్సీ పేరుతో వేతనాలు తగ్గించారని విమర్శించారు. ఉద్యోగులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద నియమించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన దాదాపు రూ.30,000 కోట్ల బకాయిలను విడుదల చేసి ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించిందని ఆలపాటి వివరించారు. 2004 నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన 10,715 మంది ఉద్యోగులను సీపీఎస్ నుంచి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పరిధిలోకి తీసుకువచ్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపామని చెప్పారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు, పీఎఫ్, డీఏ బకాయిల క్రమబద్ధీకరణ వంటి చర్యలతో ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ఉద్యోగుల సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.