- అనంతపురం జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న హేమంత్
- వెంటనే స్పందించి ఆక్సిజన్ అందించిన వైద్య సిబ్బంది
- ప్రస్తుతం నిలకడగా ఉన్న నిందితుడి ఆరోగ్యం
- నలుగురు వైద్యుల బృందంతో కొనసాగుతున్న పర్యవేక్షణ
- పోలీసుల కాల్పుల్లో గాయపడటంతో గతంలో కుడి కాలు తొలగించిన వైద్యులు
అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ చైన్‌సాతో దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్ (21) అనంతపురం సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో బెడ్ పైనుంచి కిందపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన ఆసుపత్రి సిబ్బంది, అక్కడున్న పోలీసులు అతడిని పైకి లేపి బెడ్‌పై పడుకోబెట్టారు.
ఈ ఘటన జరిగిన సమయంలో హేమంత్‌కు రక్తపోటు (బీపీ), పల్స్ రేటు గణనీయంగా పడిపోయాయి. తీవ్రమైన శ్వాస సమస్య తలెత్తడంతో వైద్యులు వెంటనే అతనికి ఆక్సిజన్ సపోర్ట్ అందించి అత్యవసర చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నలుగురు వైద్యుల బృందం నిరంతరం అతడిని పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి స్పష్టం చేశారు.
అక్టోబర్ 31న రాప్తాడు జిల్లా పరిషత్ హైస్కూల్ క్లాస్‌రూమ్‌లోకి చొరబడిన హేమంత్, గోపిక అనే విద్యార్థినిపై చైన్‌సాతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం తప్పించుకున్న అతడిని నవంబర్ 1 న ఆత్మకూరు అటవీ ప్రాంతంలో పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా, సీఐపై దాడికి దిగాడు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో హేమంత్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తప్రసరణ నిలిచిపోయి ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు అతని కుడి కాలును మోకాలి పైవరకు తొలగించాల్సి వచ్చింది. ఎడమ కాలుకు కూడా శస్త్రచికిత్స నిర్వహించారు.
మరోవైపు, దాడిలో తీవ్రంగా గాయపడి కుడి చేయి కోల్పోయిన విద్యార్థిని గోపిక బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటోంది. ప్రస్తుతం ఆమెను వెంటిలేటర్‌పై నుంచి తప్పించారు. ఈ కేసులో పోలీసుల కాల్పులు, నిందితుడికి అందుతున్న వైద్యం తదితర వివరాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పటికే పోలీసులను ఆదేశించింది.